Asianet News TeluguAsianet News Telugu

cryptocurrency and taxes in India: క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్‌పై కేంద్రం షాక్

భారత క్రిప్టో కరెన్సీ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా భారీ వృద్ధిని నమోదు చేస్తోంది. క్రిప్టోకరెన్సీలో భారతీయుల పెట్టుబడి 2030 నాటికి 241 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. నాస్‌కాం, వాజీర్ఎక్స్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో భారత క్రిప్టో వాటా 10.07 కోట్లు. క్రిప్టో కరెన్సీ నియంత్రణకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది.

cryptocurrency and taxes in India
Author
Hyderabad, First Published Jan 18, 2022, 4:18 PM IST

భారత క్రిప్టో కరెన్సీ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా భారీ వృద్ధిని నమోదు చేస్తోంది. క్రిప్టోకరెన్సీలో భారతీయుల పెట్టుబడి 2030 నాటికి 241 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. నాస్‌కాం, వాజీర్ఎక్స్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో భారత క్రిప్టో వాటా 10.07 కోట్లు. క్రిప్టో కరెన్సీ నియంత్రణకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇది సాధ్యం కాలేదు. తదుపరి బడ్జెట్ సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టవచ్చునని భావిస్తున్నారు. క్రిప్టోల్లో పెట్టుబడులను నిషేధించడానికి బదులు, పన్నులు విధించడం ద్వారా నియంత్రించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

క్రిప్టో మార్కెట్ పరిమాణం, క్రిప్టోలోని రిస్క్‌ను పరిగణలోకి తీసుకొని ఈ కింది మార్పులు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయనేది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. టీడీఎస్, టీసీఎస్ ప్రొవిజన్, ఎస్ఎఫ్‌టీ రిపోర్టింగ్, అధిక ట్యాక్స్ రేటు, నష్టాన్ని అడ్జస్ట్ చేయలేకపోవడం తదితర అంశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. థ్రెష్ హోల్డ్ పరిమితి కంటే ఎక్కువ ఉన్న క్రిప్టో కరెన్సీ అమ్మకం, కొనుగోళ్లు రెండింటిని టీడీఎస్ లేదా టీసీఎస్ నిబంధన పరిధిలోకి తీసుకు రావొచ్చునని పన్ను నిపుణులు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల ఫుట్ ప్రింట్స్‌ను పొందేందుకు ప్రభుత్వానికి సహకరిస్తుంది. క్రిప్టో కరెన్సీ అమ్మకం, కొనుగోలు.. ఈ రెండు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పరిధిలోకి తీసుకు రావాలి.

లాటరీ, గేమ్ షోలు, పజిల్స్ వంటి వాటి విన్నింగ్స్ మాదిరి క్రిప్టో కరెన్సీ ఆదాయం పైన కూడా 30 శాతం వరకు అధిక పన్ను రేటు విధించాలని అంటున్నారు. క్రిప్టె కరెన్సీ విక్రయం వల్ల వచ్చే నష్టాలను ఇతర ఆదాయం నుండి సర్దుబాటు చేయడానికి అనుమతించే అవకాశాలు లేవు. అలాగే, దీనిని క్యారీఫార్వార్డ్ చేసుకునే సౌకర్యం కూడా ఉండకపోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల అమ్మకాలు, విక్రయాలపై ట్రేడింగ్ కంపెనీల రిపోర్టింగ్ నిబంధన క్రిప్టో కరెన్సీలకు వర్తింప చేస్తారు. అంటే క్రిప్టో క్రయ, విక్రయాలను స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పరిధిలోకి తీసుకు రావాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. ఎస్ఎఫ్‌టీ వెల్లడించడం ద్వారా పన్ను చెల్లింపుదారు చేపట్టే హైవ్యాల్యూ ట్రాన్సాక్షన్‌ను అంచనా వేయవచ్చు.

ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ పైన దేశీయంగా ఎలాంటి నిషేధం, నియంత్రణ లేదు. దేశీయంగా ఆర్బీఐ ఆధ్వర్యంలో డిజిటల్ కరెన్సీని ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు ఈ నెల 31వ తేదీన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టవచ్చునని అంచనా. బడ్జెట్ ప్రతిపాదనల్లో క్రిప్టో ట్రాన్సాక్షన్స్‌ను చట్టపరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios