కార్పొరేట్లకు తక్కువ వడ్డీ రుణాలతో రిస్క్‌... ఎస్బీఐ చైర్మన్

డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గింపునకు ఒక నిర్దిష్ట పరిమితి ఉండాలని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ స్పష్టం చేశారు. కార్పొరేట్లకు తక్కువ వడ్డీపై రుణాలు ఇవ్వడం రిస్కుతో కూడిన పని అని పేర్కొన్నారు. ఇక స్పెక్ట్రం వేలానికి రుణాలివ్వడం అంటే అవి మొండి బాకీల కింద లెక్కేనని, జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులకు సూచించారు. 
 

Banking industry's NPA situation to improve by FY20-end: SBI Chairman

న్యూఢిల్లీ: ఒక నిర్ణీత స్థాయికి మించి బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) చైర్మన్ రజ్‌నీశ్‌ కుమార్‌ అభిప్రాయ పడ్డారు. ఇటీవల భారత్‌లో రుణాలపై వడ్డీరేట్లను తగ్గించే క్రమంలో భాగంగా బ్యాంకులు డిపాజిట్లపై కూడా వడ్డీరేట్లను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. 

also read ముకేశ్ అంబానీకి గట్టి షాక్ ఇచ్చిన కేంద్రం...

ఇదే విషయమై స్పందించిన ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ భారత్‌లో ప్రజల సామాజిక భద్రతకు అవసరమైన పథకాలు అందుబాటులో లేనే లేవన్నారు. శనివారం జరిగిన ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో రజ్‌నీశ్‌ మాట్లాడుతూ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించడంతో ఆర్థికంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

దేశంలో ఆర్థిక భద్రతా పథకాలు అందుబాటులో లేనందున తక్కువ రేటుకు కార్పొరేట్‌ సంస్థలకు రుణాలను అందజేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు. ఇలా తక్కువ వడ్డీకి అందించిన రుణాలు మొండి బాకీలుగా మారేందుకు ఎక్కువగా అవకాశం ఉందని రజనీశ్ కుమార్ స్పష్టం చేశారు. వడ్డీరేట్లు పెరిగినపుడు గొంతెత్తి ప్రశ్నిస్తున్న వారు వాటిని తగ్గిస్తున్నప్పుడు మాత్రం ఈ దిశగా మాట్లాడటం లేదని అన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకులు మొండి బకాయిల ఒత్తిడి నుంచి మెరుగవుతాయని రజ్‌నీశ్‌ కుమార్‌ ఆశాభావంవ్యక్తం చేశారు. అంతేగాక, రుణాలు ఇచ్చేందుకు వ్యవస్థలో ఎలాంటి ద్రవ్య కొరత లేదన్నారు. '2020 మార్చి 31 నాటికి చాలా బ్యాంకులు మొండి బాకీల పరంగా మంచి స్థాయిలో నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యవస్థలో ద్రవ్య కొరత లేదు. అయితే కార్పొరేట్స్‌ ఈ మధ్య కాలంలో అప్పులు అడగట్లేదు' అని తెలిపారు. 

also read ఆందోళన వద్దంటున్న ‘నిర్మల’మ్మ.. ఆ అలోచనల నుంచి బయటకు రండి...

ఇక స్పెక్ట్రమ్‌ వేలం నిమిత్తం టెలికాం రంగానికి అప్పులివ్వడం అభద్రతతో కూడుకున్న రుణాలని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ స్పష్టం చేశారు. 'మా వరకు స్పెక్ట్రమ్‌ల కోసం టెలికాం రంగానికి రుణాలివ్వడం అంటే అది పూర్తిగా భద్రత లేనిదే. స్పెక్ట్రంలను ప్రభుత్వం వేలం వేస్తుంది కాబట్టి పేపర్లపై అది భద్రంగానే ఉంటుంది. కానీ ఆచరణాత్మకంగా ఆ రుణాలు అంత సురక్షితం కావు. ఇందులో రుణాల ఎగవేతకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ రుణాల విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి' అని చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios