Asianet News TeluguAsianet News Telugu

బైక్స్ విపణిలో సెన్సేషన్?: సింగిల్ చార్జింగ్‌తో 156 కిలోమీటర్లు

స్టార్టప్ ఎలక్ట్రిక్ విద్యుత్ సంస్థ రివోల్ట్ ఇంటెల్లి కార్ప్స్ తొలి ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరించిన ఆర్వీ400 బైక్.. ద్విచక్ర వాహనాల మార్కెట్లో సంచలనాలు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. సింగిల్ చార్జింగ్‌తో 156 కిలోమీటర్లు ప్రయాణ సామర్థ్యం దీని ప్రత్యేకత. అపార్డబుల్ ధరకే లభించడంతో వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అంతా భావిస్తున్నారు.

Revolt announces RV400 electric motorcycle in India
Author
New Delhi, First Published Jun 19, 2019, 10:23 AM IST

న్యూఢిల్లీ: స్టార్టప్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘రివోల్ట్ ఇంటెల్లి కార్ప్’  తొలిసారి తయారు చేసిన విద్యుత్‌ మోటర్‌ సైకిల్ ‘ఆర్‌వీ400’ను ఆవిష్కరించింది. వచ్చే నాలుగు నెలల్లో ఈ మోడల్‌ను ఏడు నగరాల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కృత్రిమ మేధస్సుతో రూపొందించిన ఈ బైక్‌ను ఒక్కసారి రీచార్జి చేస్తే 156 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 

యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ బైక్‌తో ఎటువంటి కాలుష్యం ఉండబోదని రివోల్ట్ ఇంటెల్లికార్ఫ్ ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. వచ్చే నెలలో ఈ బైక్ ధరను ఈ సంస్థ ప్రకటించనున్నది. ఈ బైక్ కావాలనుకునేవారు ఈ నెల 25 నుంచి రూ.1,000 చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ ద్వారా, లేదా అమెజాన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

త్వరలో ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణె, బెంగళూరు, హైదరాబాద్, నాగపూర్, అహ్మదాబాద్, చెన్నైలలో వచ్చే నాలుగు నెలల్లో విడుదల చేయనున్నట్లు రివోల్ట్ ఇంటెల్లికార్ఫ్ ఫౌండర్ రాహుల్ శర్మ ప్రకటించారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ సమస్యలు అధికంగా ఉన్న నేపథ్యంలో కంపెనీ.. బోర్డు, పోర్టబుల్ చార్జింగ్ ఫీచర్స్, పోర్టబుల్ బ్యాటరీ వంటివి ఆఫర్ చేస్తున్నది.

నాలుగు గంటల్లో పూర్తిస్థాయిలో రీచార్జి కానున్న ఈ బైక్ బ్యాటరీ 150 కిలోమీటర్లకు పైగా పని చేయనున్నది. ఈ బైక్‌లను తయారు చేయడానికి హర్యానాలోని మానెసర్ వద్ద ఏడాదికి 1.2 లక్షల యూనిట్ల సామర్థ్యంతో ప్లాంట్‌ను సంస్థ ఏర్పాటు చేసింది.

రివోల్ట్ ఆర్వీ 40 సంప్రదాయ స్ట్రీట్ కమ్యూటర్ బైక్‌గా ఉంటుంది. అలాగే ఎల్ఈడీ లైటింగ్, స్కల్ప్‌టెడ్ బాడీ వర్క్, అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, మొనోషాక్ రేర్ సస్పెన్షన్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్స్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రిజనరేటివ్ బ్రేకింగ్ సామర్థ్యం గల ఈ బైక్ ను బ్రేకింగ్ ఎనర్జీతో రీచార్జి చేసుకోవచ్చు. 

ఆర్వీ400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మూడు మోడ్స్ ఎకో, సిటీ, స్పోర్ట్ వేరియంట్లలో లభిస్తుంది. ఎకో మోడ్ బైక్ బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 156 కిలోమీటర్లు, సిటీ మోడ్ 80-90 కి.మీ, స్పోర్ట్ మోడ్ బైక్ 50-60 కి.మీ. వరకు నడుస్తుంది. బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు మాత్రమే. 

పని ప్రదేశాల్లో పోర్టబుల్ చార్జర్‌తో రీచార్జి చేసుకునే సదుపాయం ఉంది. డెడికేటెడ్ మొబైల్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ సాయంతో బ్యాటరీ చార్జింగ్, రిమోట్ స్టార్టింగ్‌తోపాటు బైక్ లొకేషన్, రియల్ టైం రైడింగ్ ఇన్ఫర్మేషన్, జియో ఫెన్సింగ్, శాటిలైట్ నావిగేషన్, బ్యాటరీ స్వాపింగ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. బైక్ వినియోగదారులకు ఇది చౌకగానే లభిస్తుంది. ఇప్పటికీ ఇంకా ధర ఖరారు గానీ ఆర్వీ 400 మోడల్ బైక్ ధర రూ.లక్ష ఉంటుందని అంచనా వేస్తున్నారు. ద్విచక్ర వాహనాల మార్కెట్లో సంచలనాలను నెలకొల్పుతుందని అంతా భావిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios