భారతదేశంలో అతిపెద్ద కారు తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, వేగన్ఆర్ తో భారతీయ కస్టమర్ల మనసు దోచుకుంది. 25 ఏళ్లలో 33.7 లక్షల యూనిట్లు అమ్ముడవ్వగా, ప్రతి నలుగురు కొనుగోలుదారుల్లో ఒకరు ఈ కారునే కొనుగోలు చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.98 లక్షల యూనిట్లు అమ్ముడవ్వడంతో, మారుతి అత్యధికంగా అమ్ముడైన కారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.