- Home
- Business
- Safest Electric Cars: ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత భద్రతనిచ్చే కార్లు ఇవే.. ప్రమాదం జరిగినా కారులో ఉన్న వారికి ఏమీ కాదు
Safest Electric Cars: ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత భద్రతనిచ్చే కార్లు ఇవే.. ప్రమాదం జరిగినా కారులో ఉన్న వారికి ఏమీ కాదు
Safest Electric Cars: మీరు కారు కొనాలనుకుంటున్నారా? మీకు ఫుల్ సేఫ్టీ ఇచ్చే కారు కావాలా? అయితే భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో ఉత్తమ రేటింగ్ పొందిన సేఫెస్ట్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఇవే..
కొన్నేళ్లుగా కారు కొనేవారి అభిరుచులు మారిపోయాయి. మైలేజ్, ధరతో పాటు సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే భారతీయ కారు మార్కెట్‌లో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న కార్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. కొత్త కార్లలో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్(EV)లో సేఫ్టీ ఫీచర్స్ పెరుగుతున్నాయి.
మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకుంటే, మీకు, మీ కుటుంబానికి ఎక్కువ రక్షణ ఇచ్చే బెస్ట్ EV ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో ఇవి 5 స్టార్ రేటింగ్ పొందాయి.
మహీంద్రా XUV9e
ఈ ఎలక్ట్రిక్ SUV క్రాష్ టెస్ట్‌లో అద్భుతంగా రాణించింది. పెద్దలకు రక్షణ ఇచ్చే విషయంలో 32/32 పాయింట్లు సాధించింది. పిల్లల సేఫ్టీ విషయంలో 45 పాయింట్లు స్కోర్ చేసింది. XUV9e ధర రూ.21.90 లక్షల నుండి రూ.31.25 లక్షల వరకు ఉంది. ఇది SUV లక్షణాలతో కలిపి కూపే లాంటి రూఫ్‌లైన్‌ను కలిగి ఉంటుంది. ఇది పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కారు. INGLO ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఇది తయారైంది. ఇది ప్యాక్ వన్, ప్యాక్ టూ, ప్యాక్ త్రీ వంటి బహుళ వేరియంట్లలో లభిస్తుంది. అయిదుగురు హాయిగా కూర్చొని ప్రయాణించొచ్చు.
టాటా హారియర్ EV
కొత్త హారియర్ EV సేఫ్టీ అందరినీ ఆశ్చర్యపరిచింది. పెద్దలు, పిల్లల సేఫ్టీలో వరుసగా 32/32, 45/45 స్కోర్ చేసింది. హారియర్ EV రూ.21.49 లక్షల నుండి 27.49 లక్షల వరకు ఉంటుంది. ఇది అధునాతన ఫీచర్లతో, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 65 kWh, 75 kWh బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 65 kWh RWD వేరియంట్ 538 కి.మీ. వరకు వెళ్తుంది. 75 kWh RWD/AWD వేరియంట్లు అయితే 627/622 కి.మీ వరకు ప్రయాణిస్తాయి.
మహీంద్రా BE.06
మహీంద్రా BE సిరీస్ కారు కూడా సేఫ్టీలో ముందుంది. పెద్దల సేఫ్టీలో 31.97 పాయింట్లు సాధించింది. అదే పిల్లల సేఫ్టీలో 45 పాయింట్లు స్కోర్ చేసింది. BE.06 ధర రూ.18.90 లక్షల నుండి ఉంది. ఇది INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది కూపే-స్టైల్ SUV. ఇది అధునాతన సాంకేతికతను కలిగి ఉంది. అధిక సామర్థ్యం, పనితీరును అందిస్తుంది. ఇది ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా కలిగి ఉంది. BE 6, BE 6 ప్యాక్ వన్, ప్యాక్ టూ, ప్యాక్ త్రీ అనే వేరియంట్లలో లభిస్తుంది.
టాటా పంచ్ EV
పాపులర్ కంపాక్ట్ EV పంచ్ EV క్రాష్ టెస్ట్ లో పెద్దల సేఫ్టీ విషయంలో 31.46 పాయింట్లు సాధించింది. పిల్లల సేఫ్టీలో 45 పాయింట్లు స్కోర్ చేసింది. పంచ్ EV ధర రూ.9.99 లక్షల నుండి రూ.14.44 లక్షల వరకు ఉంది.
టాటా కర్వ్ EV
కూపే స్టైల్ SUV కర్వ్ EV క్రాష్ టెస్ట్ లో పెద్దల సేఫ్టీలో 30.81 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 44.83 పాయింట్లు స్కోర్ చేసింది. కర్వ్ EV ధర రూ.17.49 లక్షల నుండి రూ.22.24 లక్షల వరకు ఉంది.