- Home
- Business
- Tata Harrier EV: ఒక్క ఛార్జ్‌తో 622 కి.మీ. ప్రయాణించే కారు కావాలా? దీనికి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది
Tata Harrier EV: ఒక్క ఛార్జ్‌తో 622 కి.మీ. ప్రయాణించే కారు కావాలా? దీనికి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది
సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు 200 కి.మీ. లేదా మాక్సిమం 300 కి.మీ. ప్రయాణిస్తాయి. కాని టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారు మాత్రం ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 622 కి.మీ. ప్రయాణిస్తుంది. ఇది భారతదేశంలో వేగవంతమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా నిలిచింది.

టాటా హారియర్ ఎలక్ట్రిక్ వెహికల్ బుకింగ్ ప్రారంభం
కొత్త హారియర్ EVతో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ SUV విభాగంలోకి ప్రవేశించింది. హారియర్ EV బుకింగ్‌లు జూలై 2న ప్రారంభమయ్యాయి. దీనికి ఆదరణ అద్భుతంగా ఉంది. ఒకే రోజులో 10,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి.
ఎలక్ట్రిక్ SUV విభాగంలో రెండవ అత్యధిక బుకింగ్‌లు పొందిన EVగా హారియర్ నిలిచింది. ఈ EV ప్రస్తుతం టాటా పూణే ప్లాంట్‌లో తయారవుతోంది. డిజైన్, పవర్, పనితీరులో వినియోగదారులకు కొత్తదనాన్ని అందించేలా దీన్ని తయారు చేస్తున్నామని టాటా కంపెనీ తెలిపింది.
రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో హారియర్
హారియర్ EV 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. పెద్ద బ్యాటరీ 627 కి.మీ. రేంజ్ ఇస్తుంది. చిన్నది 538 కి.మీ. వరకు ఇస్తుంది.
టాటా C75 స్టాండర్డ్ టెస్ట్ ప్రకారం 65kWh బ్యాటరీ 420–445 కి.మీ., 75kWh వెర్షన్ 480–505 కి.మీ. ఇస్తుంది. ఇది హారియర్ EVని లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్‌కి వీలుగా తయారవుతోంది.
అద్భుతమైన కెమెరా సిస్టమ్స్
టాటా హారియర్ EV అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఇది 540 డిగ్రీ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది 360 డిగ్రీ వ్యూతో పాటు అండర్‌బాడీ వ్యూను కూడా చూపిస్తుంది.
ఇది ఆఫ్ రోడింగ్‌కి ఉపయోగపడుతుంది. డ్యూయల్ మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో, హారియర్ EV కేవలం 6.3 సెకన్లలో 0–100 kmph వేగాన్ని అందుకుంటుంది.
ఆరు డ్రైవ్ మోడ్‌లు కలిగిన హారియర్ EV
ఫ్యూయల్ వేరియంట్ హారియర్ మూడు డ్రైవ్ మోడ్‌లతో వస్తుండగా, EV వేరియంట్ ఏకంగా ఆరు మల్టీ-టెర్రైన్ మోడ్‌లను అందిస్తుంది. అవి నార్మల్, మడ్ రట్స్, రాక్ క్రాల్, ఇసుక, స్నో/గ్రాస్, కస్టమ్. ఇది ఎలాంటి ప్రదేశాల్ల అయినా, రోడ్లలో అయినా ఈజీగా ప్రయాణిస్తుంది.
ఇందులో 14.5 అంగుళాల సామ్‌సంగ్ QLED ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంది.
ఇండియా NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్
టాటా కంపెనీ భద్రత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. హారియర్ EV ఇండియా NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందటమే దీనికి నిదర్శనం. ఇది ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ టెస్టింగ్ రెండింటిలోనూ 5 స్టార్ రేటింగ్ పొందింది.
ఇందులో షార్క్ ఫిన్ యాంటెన్నా కలిగిన కెమెరా ఉంది. ఇది డిజిటల్ IRVMకి లైవ్ వీడియోను అందిస్తుంది.