- Home
- Automobile
- వానల్లో కారు అద్దాలపై ఫాగ్ మిమ్మల్ని చిరాకు పెట్టిస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి
వానల్లో కారు అద్దాలపై ఫాగ్ మిమ్మల్ని చిరాకు పెట్టిస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి
వర్షాకాలంలో కారు అద్దాల మీద పొగమంచు కమ్మేస్తుంటే చిరాకుగా ఉందా? కొన్ని సింపుల్ చిట్కాలు ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కారు అద్దాలపై పొగమంచు తొలగించే చిట్కాలు
Car Maintance Tips: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరువానలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా మారడం... బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అనుకూల పరిస్థితుల కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు బాగానే పడుతున్నాయి.
అయితే వర్షాకాలంలో డ్రైవింగ్ అంటే నరకమే అని చెప్పాలి.. వాహనదారులు చాలా ఇబ్బందులు పడతారు. అందులో ఒకటి కారు అద్దాలను ఫాగ్(పొగమంచు) కప్పేయడం. దీనివల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.
వర్షం కారణంగా కారు అద్దాలపై నీరు ప్రవహించగా కొంత తేమ లోపలికి కూడా వస్తుంది. కారు బయట ఉష్ణోగ్రతకు లోపలి ఉష్ణోగ్రతకు తేడా ఉండటంవల్ల ఇలా కారు లోపలివైపు అద్దాలపై ఫాగ్ ఏర్పడుతుంది. దీనివల్ల డ్రైవింగ్ చేసేవారికి ముందువచ్చే వాహనాలు కనిపించవు. అసలే వర్షంతో రోడ్డు కనిపించదు... ఆపైన ఈ ఫాగ్ కారణంగా ముందొచ్చే వాహనాలు కూడా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
కారు అద్దాలపై పడే నీటిని తొలగించడానికి వైపర్స్ ఉపయోగించవచ్చు.. మరి లోపల ఏర్పడే ఫాగ్ సంగతేంటి? ప్రతిసారి డ్రైవర్ లేదా ముందుసీట్లో కూర్చున్నవారు తుడుస్తూ ఉండాలా? ఈ ఫాగ్ కేవలం డ్రైవర్ కే కాదు కారులోని మిగతావారికి కూడా చిరాకు తెప్పిస్తుంది. మరి ఇలాంటప్పుడు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ వర్షంలో ఫాగ్ బాధ లేకుండా హాయిగా ప్రయాణం సాగించవచ్చు. వాటి గురించి ఇక్కడ చూద్దాం.
1. డిఫాగర్ వాడటం
దాదాపు అన్ని ఫోర్ వీలర్స్ లో విండ్ షీల్డ్ దగ్గర గాలి బయటకి వచ్చేలా దారులు ఉంటాయి. కానీ చాలామందికి వీటి ఉపయోగమేంటో తెలియదు. క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఆన్ చేస్తే గాలి నేరుగా విండ్ షీల్డ్ మీద పడుతుంది. దీనివల్ల కొన్ని సెకన్లలో అద్దం మీద ఉన్న మంచు పూర్తిగా మాయమవుతుంది.
2. ఏసీ టెంపరేచర్ సరిగ్గా పెట్టుకోండి
కారు అద్దం మీద మంచు కమ్మడానికి కారణం గాలిలో తేమ ఎక్కువగా ఉండటం… లోపలి, బయటి ఉష్ణోగ్రతల మధ్య తేడా ఉండటమే. మీ కారు MID లో లేదా గూగుల్ లో బయటి ఉష్ణోగ్రత చూడొచ్చు. దానికి తగ్గట్టుగా లోపలి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు తక్కువగా పెట్టుకుంటే మంచుని తేలిగ్గా తొలగించవచ్చు. ఉదాహరణకు బయట ఉష్ణోగ్రత 22 డిగ్రీలు ఉంటే ఏసీ టెంపరేచర్ 20 డిగ్రీలకి పెట్టుకోవచ్చు. దీనివల్ల మంచు కమ్మదు.
3. వైపర్ బ్లేడ్ ని సరిగ్గా వాడండి
మీ కారు వైపర్ బ్లేడ్స్ ని సరిగ్గా చెక్ చేసుకోవాలి. వైపర్ బ్లేడ్స్ మంచి కండిషన్ లో ఉండాలి, విండ్ షీల్డ్ ని బాగా శుభ్రం చేయాలి. వర్షాకాలంలో క్లియర్ గా చూడటానికి, దుమ్ము, పొగ, మలినాలను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే కారులో మంచు కమ్మడాన్ని తేలిగ్గా నివారించవచ్చు.
4. విండోస్ ఓపెన్ చేయడం
కారు కిటీకీలను కొద్దిసేపు దించడంద్వారా బయటగాలి లోపలికి రావడం, లోపలిగాలి బయటకు వెళ్లడం జరుగుతోంది. దీంతో ఉష్ణోగ్రతలు సమతుల్యంగా మారి ఫాగ్ తొలగిపోతుంది.
5. యాంటి ఫాగ్ స్ప్రేలు వాడటం
మార్కెట్లో అనేక యాంటి ఫాగ్ స్ప్రేలు లభిస్తున్నాయి. వాటిని కారులో పెట్టుకుని వర్షం కురిసే సమయాల్లో ఉపయోగించుకోవచ్చు. ఇక సిలికా జెల్ ప్యాకెట్లను కారులో ఉంచడంద్వారా అవి గాలిలోని తేమను గ్రహించి పొగమంచు ఏర్పడకుండా చూస్తాయి.