Asianet News TeluguAsianet News Telugu

ఆధునీకరణకు ‘మారుతి’ ప్లాన్: గుర్గావ్ ప్లాంట్ బదిలీకి వ్యూహం

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ ప్రస్తుతం గుర్గావ్‌లోని తన ఫ్యాక్టరీని హర్యానాలోని మరో ప్రదేశానికి తరలించాలని తలపోస్తున్నది. ప్రస్తుతం గుర్గావ్ ‘దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోకి వస్తున్నది. దీనికి తోడు గుర్గావ్‌లోని ప్యాక్టరీ స్థలం కార్ల ఉత్పత్తికి ఇరుకిరుకుగా మారిపోయిందని యాజమాన్యం భావిస్తోంది. 

Maruti Suzuki plans to shift factory from Gurgaon, expand and modernise
Author
Mumbai, First Published Sep 12, 2018, 11:05 AM IST

ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ ప్రస్తుతం గుర్గావ్‌లోని తన ఫ్యాక్టరీని హర్యానాలోని మరో ప్రదేశానికి తరలించాలని తలపోస్తున్నది. ప్రస్తుతం గుర్గావ్ ‘దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోకి వస్తున్నది. దీనికి తోడు గుర్గావ్‌లోని ప్యాక్టరీ స్థలం కార్ల ఉత్పత్తికి ఇరుకిరుకుగా మారిపోయిందని యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉత్పాదక యూనిట్‌ను మరో ప్రదేశానికి బదిలీ చేయాలన్న ప్రణాళిక రూపొందిస్తున్న సంస్థ మేనేజ్మెంట్.. అందుకు నాలుగైదేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తోంది. 

నూతన ప్రదేశంలో మారుతి సుజుకి ఉత్పత్తి చేయడానికి నాలుగైదేళ్లు పడుతుందని సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. కానీ దీనిపై అధికారికంగా సుజుకి మోటార్స్ అధికార ప్రతినిధి నిరాకరించారు. 1983లో ‘మారుతి 800’ మోడల్ కారును మార్కెట్‌లోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన మారుతి సుజుకి గుర్గావ్ యూనిట్.. దేశీయంగా కార్ల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. నాటి నుంచి సంస్థ క్రమంగా పెరిగి దేశంలోనే అతిపెద్ద ఆటోమేకర్ అవతారమెత్తింది. ఈనాడు ప్రతి రెండు ప్రయాణికుల కార్లలో ఒకటి మారుతి సుజుకిది అంటే అతిశయోక్తి కాదు. 


దేశీయంగా కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకి సంస్థ సాధించిన విజయం ఇతర ఆటో మేకర్లు కూడా భారతదేశంలో యూనిట్లు ప్రారంభించేందుకు, నిధులు మదుపుచేసేందుకు దోహదపడుతోంది. తద్వారా భారతదేశంలో ఉత్పాదక యూనిట్లకు పునాది, ప్రయాణికుల కార్లు, విడి భాగాలకు మార్కెట్‌గా మారుతి సుజుకి నిలిచింది. ఫ్యాక్టరీ ఆధునీకరణ సాకుతో మారుతి సుజుకి కొత్తగా హర్యానాలో భూమి పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గుర్గావ్ నగరానికి 25 కి.మీ దూరంలో సొహ్నా ప్రాంతంలో 1200-1400 కి.మీ. ఎకరాల భూమిని కేటాయించాలని హర్యానా ప్రభుత్వాన్ని మారుతి సుజుకి కోరింది. కానీ హర్యానా ప్రభుత్వం నేరుగా భూమి కేటాయించడానికి నిరాకరించింది. వేలం ద్వారా విక్రయిస్తామని తెలిపింది. 

మారుతి సుజుకి ప్రస్తుత యూనిట్‌కు సమీపంలో కొత్త యూనిట్ స్థాపించాలని భావిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని మారుతి సుజుకి యూనిట్ విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది. నూతన తరం విద్యుత్, హైబ్రీడ్ వాహనాల ఉత్పత్తికి ప్రస్తుతం గుజరాత్ యూనిట్‌ను వాడుకుంటున్నది. గుర్గావ్ యూనిట్ స్థలం విలువ అంచనా వేస్తే భారీగా రియల్ ఎస్టేట్ విలువను  అంచనా వేయలేకపోయింది. 

మూడింట నాలుగొంతుల అసెంబ్లీ లైన్ల పరిధిలో రూ.10 వేల నుంచి రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెబుతున్నారు. గుర్గావ్‌లోని యూనిట్ ఆరేడు లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసిన మారుతి సుజుకి కొన్నేళ్లుగా వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేస్తోంది. కొన్నేళ్ళుగా స్థానికులు మారుతి సుజుకి ఉత్పాదక యూనిట్ ను మార్చేయాలని కోరుతున్నారు. ట్రక్కుల కదలికలు కూడా సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios