ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి భారీ ఆపర్లను ప్రకటించింది. ఫెస్టివల్ సేల్ ఆఫర్లో భాగంగా పన్నెండు లక్షల విమానం టికెట్లను అతి తక్కువ ధరకే అందిస్తోంది సోమవారం నుండి ఈ టికెట్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది.

ఇప్పటికే పలు ఆపర్ల ద్వారా అతి తక్కువ ధరలకు విమాన ప్రయాణాన్ని అందిస్తూ ఇండిగో  సంస్థ మధ్యతరగతి వినియోగదారులకు చేరువైంది. అయితే వీరికి మరింత దగ్గరయ్యేందుకు తాజాగా ''ఫెస్టివల్ ఆఫర్'' పేరుతో పన్నెండు లక్షల విమానం టికెట్లను అమ్మకానికి పెట్టింది. ఈ ఎంపిక చేసిన సీట్లన్నింటిని కేవలం రూ. 1212 ధరకే అందుబాటులో ఉంచినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్ నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అయితే వినియోగదారులకు ఈ టికెట్ ధరను మరింత తగ్గించే చిట్కాను కూడా ఈ సంస్థే తెలిపింది. మొబిక్విక్ వాలెట్ యాప్ ద్వారా ఈ టికెట్లు కొనుగోలు చేస్తే 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించనుంది.

తమ సంస్థ ప్రకటిస్తున్న ఆఫర్లకు మంచి ఆధరణ లభిస్తున్నట్లు ఇండిగో సంస్థ వాణిజ్య అధికారి విలియం బౌల్టర్ తెలిపారు. ప్రయాణికులకు ఈ ఆఫర్ల ద్వారా ప్రయాణికులకు తమ సంస్థ చాలా దగ్గరైందని, మరిన్ని ఆఫర్లతో మున్ముందు కూడా వారిని మెప్పించడానికి ప్రయత్నించనున్నట్లు తెలిపారు.