Asianet News TeluguAsianet News Telugu

మనం చేసే మంచి చెడులకు 18మంది సాక్షులు

చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత కానీ...ఎవరు చూసినా చూడక పోయినా ఎవరి అంతరాత్మ వారిని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటుంది. దానిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మర్చి పోవద్దు.

witness for good and bad things
Author
Hyderabad, First Published Aug 29, 2019, 2:07 PM IST

మనం ప్రతీరోజూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాయి. అందులో మంచివి కొన్ని. చెడు పనులు కొన్ని. చెడు పనులు చేస్తున్నప్పుడు చుట్టూ చూసి ఎవరూ లేరు అనుకొని చేస్తూ ఉంటారు. అంటే మనకు ఎదురుగుండా మన కంటికి కనిపించిన వాళ్ళు లేకపోతే మనం చేసే పనిని ఎవరూ చూడడం లేదనుకోవడం ఎంతో పెద్ద భ్రమ. మనల్ని ఎప్పటికీ కనిపెట్టుకుని మన చుట్టూరా మనకు కనపడకుండా 18 మంది సాక్షులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ మాట్లాడతారా? అంటే మాట్లాడరు. మనకి కనిపిస్తారు. కాని వాళ్ళని మనం సాక్షులుగా గుర్తించం. మనుషులు చూసిన విషయాన్ని చూడనట్లుగా చెపుతూ ఉన్నా అవి మాత్రం ఏమీ మ్లాడకుండా ఉంటాయి. అసలైన సాక్షులు వీరే. వీటిని గురించి తెలుసుకుందాం.

చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత కానీ...ఎవరు చూసినా చూడక పోయినా ఎవరి అంతరాత్మ వారిని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటుంది. దానిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మర్చి పోవద్దు.

నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు, అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు.

మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాకక్షులు పద్దెనిమిది ఉన్నాయి అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి.

వీటినే అష్టాథ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాకక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి.

ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు.

దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్షం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమ పడుతుంటాడు.

ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వింవి. అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి.

అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు. ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామ క్రమం. అత్యుత్కటైః పుణ్య పాపైః ఇహైవ ఫలమశ్నుతే.

అంతరాత్మ అనేది ఒకటుంటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా చెడ్డదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పేస్తుంది.

కానీ ఆవేశం, కోపం, క్షణికావేశంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారి తీయటం మనందరికీ అనుభవమే.

ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం.

నలుగురికీ తెలిసేలా దానధర్మాలు క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం.

అష్టాదశ  సాకక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం.

ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయానికి తెగించడు.

ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌ సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖ శాంతులకు నోచుకుంటాడు.

Follow Us:
Download App:
  • android
  • ios