ఇంట్లో  భర్త చీపురు పడితే మంచిదా? సరైన దిశ, సమయం, చీపురు వాస్తు చిట్కాలు పాటిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, సానుకూల శక్తి పెరుగుతాయి.

ఇల్లు కట్టడం నుంచి వంటగది, బాత్రూమ్ దిశ వరకు అన్నీ వాస్తు ప్రకారం ఉండాలి. ఈ ప్రాచీన భారతీయ శాస్త్రం ఇంటి నిర్మాణం నుంచి ప్రతి దిశకు సంబంధించిన నియమాలు చెబుతుంది. వీటిని పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు. ఇల్లు, వంటగది, బాత్రూమ్, దిశల గురించి చాలా విషయాలు తెలిసినా, భర్త ఇంటి పనుల్లో భార్యకు సాయం చేస్తే, ముఖ్యంగా చీపురు పడితే అది వాస్తు ప్రకారం సరైనదా కాదా అని ఎప్పుడైనా ఆలోచించారా?

ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. ఒకరు వంట చేస్తే, మరొకరు ఇంటిని శుభ్రం చేస్తారు. వాస్తు శాస్త్రంలో శుభ్రతకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఇంటిని శుభ్రంగా ఉంచడమే కాకుండా, ప్రతికూల శక్తిని కూడా నివారిస్తుంది. కానీ ఇంట్లో తరచుగా భర్త లేదా మరే ఇతర పురుషుడు చీపురు పడితే దానికి చాలా అర్థాలున్నాయి. అవి అందరికీ తెలిసి ఉండాలి.

పురుషులు ఇంట్లో చీపురు పట్టడం సరైనదా కాదా?

వాస్తు శాస్త్రం ఎప్పుడూ చీపురు పట్టడం కేవలం స్త్రీల పనే అని చెప్పలేదు. సమాజంలో ఇంటి పనులు స్త్రీలవే అనే భావన ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆ ఆలోచన క్రమంగా మారుతోంది. స్త్రీలతో పాటు పురుషులు కూడా ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నారు. కాబట్టి మీ ఇంట్లో కూడా భర్త చీపురు పడితే అది తప్పేమీ కాదు.

వాస్తు ప్రకారం చీపురు ఎలా ఉంచాలి?

పురుషుడైనా, స్త్రీ అయినా ఎవరైనా చీపురు పట్టవచ్చు, కానీ దాన్ని ఉంచడానికి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

  • చీపురు సరైన దిశ తెలుసుకోండి. దాన్ని ఎల్లప్పుడూ నైరుతి మూలలో ఉంచాలి.
  • వాస్తు ప్రకారం చీపురు ఉంచే విధానం తెలుసుకొని, దాన్ని ఎల్లప్పుడూ దాచి ఉంచాలి.
  • రాత్రి చీపురు వాడాలా వద్దా అనే ప్రశ్న అందరికీ వస్తుంది. సమాధానం వద్దు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపురు పట్టకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది.
  • తరచుగా కోపంలో చీపురుతో కొడతారు లేదా దానిపై కాలు వేసి నడుస్తారు. అలా చేయకండి. వాస్తు ప్రకారం ఇది చాలా తప్పు.

పురుషులు చీపురు పట్టడం వాస్తు ప్రకారం మంచిది

భర్త భార్యకు సాయం చేస్తూంటే , తరచుగా చీపురు పడితే, అది సానుకూల శక్తిని పెంచుతుంది. శ్రమపడి శుభ్రతలో పాలుపంచుకునే వ్యక్తి ఇంటి శ్రేయస్సుకు కూడా దోహదపడతాడు.