Asianet News TeluguAsianet News Telugu

జాతకంలో కాల సర్ప దోషం ఉంటే.. ?

లగ్నం నుండి సప్తమ స్థానం మధ్యలో అన్ని గ్రహాల బంధించేది అనంత దోషం అవుతుంది.

The Story of kala sarpa dosh
Author
Hyderabad, First Published Jun 18, 2020, 2:37 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

The Story of kala sarpa dosh

        అగ్రే రాహు: రధౌ కేతు: మధ్యే షడ్ర్గహో 
        యది కాలసర్పాఖ్య యోగోయం నృపానాం సమరం ధృవం 
        అగ్రే కేతు: రధౌరాహు: గర్భస్తే గ్రహసప్తకే 
        యది అపసవ్యకాలసర్పాఖ్య దోషోయం నృపాణాo సమరం భవేత్  
            
సర్పమునకు రాహువు తల , కేతువు తోక అవుతుంది. జాతకంలోని జన్మ కుండలిలో రాహు, కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే దానిని 'కాలసర్ప యోగం' అంటారు. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. వాటి స్థాన స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయించబడింది. దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే దోష ఫలితం కూడా నిర్ణయించబడుతుంది.

* కాలసర్ప దోషం:- రాహువు - రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని- కేతువు.
             ఫలితాలు:- కుటుంబ సమస్యలు, దీర్ఘా రోగాలు. 

* అపసవ్య కాలసర్ప దోషం: కేతువు - రాహువు మధ్య మిగలిన ఏడు గ్రహాలూ రావడం.

అనంత కాలసర్ప దోషం :- లగ్నం నుండి సప్తమ స్థానం మధ్యలో అన్ని గ్రహాల బంధించేది అనంత దోషం అవుతుంది.
ఫలితాలు:- ప్రతీది  అనేక ఇబ్బందులతో బతుకు భారమైన జీవితం గడుస్తుంది,అన్నింట్లో ఇబ్బంది కలిగించును.

గుళిక కాల సర్ప దోషం:- మాములుగా ఇది జాతక చక్రంలో ద్వితీయం నుండి  ప్రారంభమై 8 వ ఇంట సమాప్తం అవుతుంది.
ఫలితాలు:- ఆర్ధిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు. 27 సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగించును.

వాస్తుకి కాలసర్ప దోషం:- 3 వ ఇంట మొదలై 9 వ ఇంట సమాప్తం.
ఫలితాలు:- అన్నదమ్ముల కలహాలు, సమస్యలు. 36 సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగించును.

శంఖపాల కాలసర్ప దోషం:- 4 వ ఇంట మొదలై 10 వ ఇంట సమాప్తం.
ఫలితాలు:- తల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గండం, నివాస స్థల సమస్యలు. 42 సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగించును.

పద్మ కాలసర్ప దోషం:- 5 వ ఇంట ప్రారంభమై 11 వ ఇంట సమాప్తం.
ఫలితాలు:- జీవిత భాగస్వామితో కాని పిల్లలతో కాని సమస్యలు. 48 సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగించును.

మహా పద్మ కాలసర్ప దోషం:- 6 వ ఇంట ప్రారంభమై 12 వ ఇంట సమాప్తం.
ఫలితాలు:- ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ. 58 సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగించును.

తక్షక కాలసర్ప దోషం:- ఏడవ ఇంట ప్రారంభం లగ్నం వరకు.
ఫలితాలు:- వ్యాపార నష్టాలు, వివాహ జీవతంలో ఇబ్బందులు.

కర్కటక కాలసర్ప దోషం:- 8 వ ఇంట ప్రారంభం 2 వ ఇంట సమాప్తం.
ఫలితాలు:- భార్యతో ఇబ్బందులు, అనుకోని సంఘటనలు.

శంఖ చూడ కాలసర్ప దోషం:- 9 వ ఇంట ప్రారంభం 3  వ ఇంట సమాప్తం.
ఫలితాలు:- తండ్రి వాళ్ళ ఇబ్బందులు, అత్యంత దురదృష్ట  స్థితి.

ఘటక కాలసర్ప దోషం:- 10 వ ఇంట ప్రారంభం 4 వ ఇంట సమాప్తం.
ఫలితాలు:- వ్యాపార, ఉద్యోగ సమస్యలు.

విషక్త కాలసర్ప దోషం:- 11 వ ఇంట  ప్రారంభం 5 వ ఇంట సమాప్తం.
ఫలితాలు:- ఆర్ధిక, వ్యాపార కష్టాలు.

శేషనాగ కాలసర్ప దోషం:- 12 వ  ఇంట  ప్రారంభం 6 వ  ఇంట సమాప్తం.
ఫలితాలు:- ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు.

అపసవ్య కాలసర్ప దోషం:- 12వ  ఇంట  ప్రారంభం 6 వ  ఇంట సమాప్తం.
ఫలితాలు:- ఆలస్య వివాహం. వైవాహిక జీవిత ఇబ్బందులు.
 
కాల సర్ప దోషాలుఅనేకం చెప్పబడినవి, అందులో అతి ముఖ్యమైనవి పన్నెండు రకాలు : -

     1. అనంత కాలసర్ప దోషము.
     2. శంఖపాల  కాలసర్ప దోషము.
     3. కర్కోటక  కాలసర్ప దోషము.
     4. శేషనాగ కాలసర్ప దోషము.
     5.  గుళిక కాల సర్ప దోషము.
     6. పద్మ కాలసర్ప దోషము.
     7. మహాపద్మ కాలసర్ప దోషము.
     8.  వాసుకి  కాలసర్ప దోషము.
     9.తక్షక కాలసర్ప దోషము.
    10. విషక్త కాలసర్ప దోషము.
    11. పాతక కాలసర్ప దోషము.
    12.  శంఖచూడ కాలసర్ప దోషము.

కాలసర్ప యోగ ఫలితాలు:- 

   * నివాస కాలం / ఆయుప్రమాణము తగ్గించును.

   * చేసే ప్రతి పనికి ఆటంకములు కల్గును.

   * పేదరికం, ఆర్ధిక ఇబ్బందులు కలిగించును.

   * పిత్రార్జితం హరించి పోవును.

   * శత్రువులు, గుప్త శత్రువులు అధిక మగుట చేయును.

   * తోబుట్టువులతో ఇబ్బందులు కలిగించును.

   * తరచూ జైలు వెళ్ళడం, పోలీస్ కేసులుంటాయి.

   * ఎంత నీతివంతంగా, ధర్మ బద్దంగా కష్ట పడ్డా తగు ఫలితాలు దక్కక ఎదో ఒక సమస్యలు రావడం.  

   * జన్మించిన సంతానమునకు బుద్ధి మాంద్యం కలుగట.
 
   * గర్భంలో శిశువు మరణించుట.

   * వైవాహిక జీవతంలో అనందం లేక అసంతృప్తి, భార్తభర్తల మధ్య సమన్వయం లేక పోవుట.
 
   * మరణించన శిశువును ప్రసవించుట.
    
   * గర్భం నిలవక పోవుట.
 
   * అంగ వైకల్యంతో సంతానం కలుగుట.

   * దీర్ఘకాలిక వ్యాధులు  ఏర్పడుట, చికిత్స విఫలమై మరణించుట.
 
   * మొండి వ్యవహరించుట, శత్రువు వలన మృతి చెందుట.
 
   * మానసిక ప్రశాంత లేక పోవుట, ప్రమాదాలు, అవమానాలు.
 
   * సర్ప దోషాల వలన అనేక కుటుంబ, ఉద్యోగ, వ్యాపార సమస్యలుండుట. 

లగ్నం నుండి సప్తమ స్థానం వరకు ఉన్నచో ప్రధమ భాగం అంతరాయలతో జీవితం సాగుతుంది. 7 నుండి 12 వ స్థానంలో ఉన్నచో రెండవ భాగం ఇబ్బంది పెడుతుంది. 6, 7 , 8 వ స్థానంలో రాహువు ఉంటే సర్ప దోషం ఏర్పడుతుంది. జాతకంలో ఈ దోషం ఏర్పడితే మొదట తీవ్రమైన ఇబ్బంది పెట్టి 33 సంవత్సరాల తర్వాత ప్రభావం కొంత తగ్గుతుంది. స్త్రీ, పురుష బేధం లేకుండా కాలసర్ప దోషాలన్నియును అశుభ ఫలితాలను కలిగించేవే కాబట్టి జాతకంలో ఏర్పడిన కాలసర్ప దోషాన్ని అనుభవజ్ఞులైన పండితుడితో 72 వేల సార్లు జపం చేయిస్తే నివారణ కలుగుతుంది. జీవిత ప్రారంభ దశ అనుకూలంగా లేకపోతే సంతృప్తి అనిపించదు అందుకు కాల సర్ప దోష శాంతి విధానములనుసరించుటయే శ్రేయస్కరం.

Follow Us:
Download App:
  • android
  • ios