శ్రావణ బహుళ అష్టమి కృష్ణాష్టమి అంటారు. ముఖ్యమైన వ్రతాలలో ఇది కూడా ఒకి. దీనిని కృష్ణుని జన్మదిన వేడుకలుగా జరుపుకుంటారు. కృష్ణుడు గోకులంలో పెరిగాడని గోకులాష్టమి అని, శ్రీ జయంతి అని, కృష్ణ జయంతి అని కూడా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తారు.

ఈ అష్టమిని గొప్ప వ్రతదినంగా పరిగణిస్తారు. ఉపవాస, జాగరణాది పనులు చేస్తారు. ఇందులో నైవేద్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. డెలివరీ అయిన తరువాత బాలింతలు ఏ పదార్థాలు అయితే తింరో కృష్ణాష్టమిరోజున అవే పదార్థాలు నైవేద్యంగా సమర్పించుకుటాంరు.

వేయించిన మినపపిండితో పంచదార కలిపి కాయం చేసి నివేదన చేస్తారు. ఇది కొన్ని ప్రాంతాలలో నైవేద్యంతో శొంఠి పొడిని కూడా పెడతారు. ఈ శొంఠి పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. అది కొంచెం తియ్యగా, కారం కారంగా ఉంటుంది. శొంఠి మిరియం కొద్ది నీళ్ళలో నూరి బెల్లంతో పాకం ప్టి దాని సరిపడ నేయి కలిపి తయారు చేస్తారు.

ఇప్పుడిప్పుడు చింతకాయ చిన్నగా కొత్తది వస్తుంది. దానిని వామన గాయ అంటారు. ఇది చాలా లేతగా వామనమూర్తి లాగా చాలా చిన్నగా ఉంటుంది. ఈ పచ్చడి కూడా తప్పనిసరిగా పెట్టడం ఆచారంలో ఉంటుంది.

శ్రీకృష్ణుడు పుట్టినది రాత్రివేళలో కనుక ఈ పూజను రాత్రిపూట చేస్తారు. మట్టితో బొమ్మలను చేస్తారు. వాటికి మాత్రమే పూజ చేస్తారు. ముఖ్యమైన బొమ్మలు అన్నీ తయారు చేస్తారు. మొత్తం 10 నుంచి 12 రకాల బొమ్మలను తయారు చేసి పూజ చేస్తారు.

కాయం నైవేద్యం వస్తువు అనడంతోటే ఇది తల్లులకు ప్రియమైన పండుగ అని కూడా చెప్పవచ్చు. మమతను పెంచే పర్వాలలో ఇది ఒకి అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుని బాల్య చేష్టలను గుర్తుకు తెచ్చుకునే పండుగ ఇది అని చెప్పవచ్చు. ఈ క్రియలో పాప పుణ్యాల ప్రస్తావననే ఉండదు. అందరూ ఆనందంతో కలిసి జరుపుకునే కార్యక్రమం.

ఇంటిలో శ్రీకృష్ణుడి పాదాలు వేసి ఉంచుతారు. చిన్ని కృష్ణుడు తమ ఇంటిలోకి వస్తాడనే ఆలోచనతో వేస్తారు. ఇవి కూడా సాయంకాలం గోధూళీవేళ వేస్తారు. ఆ సమయంలో గోవులు ఇంటికి వచ్చే వేళ. గోవులన్నా గోపాలకులకు అన్నా శ్రీకృష్ణునికి చాలా ఇష్టం కనుక ఆ పనులు చేస్తారు.

కొందరు కృష్ణ లీలలను గానం చేస్తారు. కృష్ణ జననం, కంసవధ, దధిమథనం, రాసక్రీడ మొదలైన నాటక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తారు.

ఈ రోజున ముఖ్యంగా ఉట్ల సంబంరం చాలా గొప్ప సంబరం. ఈ సంబంరానికి రెండు స్తంభాలు పాతి వాటికి అడ్డంగా పైన ఒక వాసం కడతారు. స్తంభాలకు అలంకారంగా కొబ్బరి ఆకులు చుడతారు. గెలలతో అరి స్తంభాలు ఆన్చి కడతారు. ఆ స్తంభాలను అలంకరిస్తారు. వాసానికి ఒక నడుమన ఒక ఉట్టిని కట్టి దానిలో ఒక పెరుగు ముంత పెడతారు. ఆ ఉట్టినిపైకి క్రింది లాగడానికి గిలక ఉంటుంది. ముంతలో పెరుగు పోస్తారు. డబ్బులు వేస్తారు. కృష్ణుని వేషం వేసి వచ్చి ఎగిరి వచ్చి ఆ ముంతను అందుకోవానికి ప్రయత్నిస్తారు. ఆ ముంత వారికి అందకుండా ఉట్టిని గిలక సహాయంతో పైకి కిందికి లాగుతూ ఆడుతూ ఉంటారు. ఇది ఊరంతా కలిసి చేసుకునే పర్వంలాగా ఉంటుంది.

అందుకే కృష్ణం వందే జగద్గురుం.