మధ్యమదేహం, విశాలమైన ముఖం, లావైన మెడ కలిగి అందమైన రూపం వీరిది. వీరికి ఒంటెద్దు పోకడ ఉంటుంది. అన్ని పనులు తామే చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వారికి తొందరగా ఏ బాధ్యతను అప్పగించరు. వీరు అన్ని బాధ్యతలను తమపై వేసుకొని పనులు నిర్వహిస్తారు. కాని కూర్చున్న చోటునుంచే పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తిరిగే తత్త్వం వీరికి నచ్చదు. ఎంతో అత్యవసరమైతే కాని తిరుగరు. అన్ని విషయాలు తమలోనే దాచుకుంటారు. తొందరగా బయట పడరు. మెత్తని స్వభావం కలవారు.

ధనం విషయంలో జాగ్రత్త పడతారు. స్నేహాలను పెంచుకుంటూ తమ పనులను పూర్తి చేసుకుంటారు. మధ్యవర్తిత్వాలు చేస్తూ ఉంటారు. చాకచక్యంగా పనులు పూర్తి చేసుకుంటారు. అందరి మన్ననలను పొందుతారు. కళారంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శ్రమపడడానికి ఇష్టపడరు. అన్నీ అనుకూలంగా ఉంటే అన్ని పనులు నిర్వహిస్తారు. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు వీరు చేసే మధ్యవర్తిత్వాలు బావుంటాయి. వీరి సమయం అనుకూలంగా లేనప్పుడు ఆ పనుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు.

ఉదా : నా మాటను ఎవరూ వినడం లేదు - మాట్లాడితే అపార్థం చేసుకుంటున్నారు - దాచుకున్న ధనం ఉండడం లేదు - బంధువర్గం, కుటుంబంతో  ఇబ్బందులు ఏర్పడుతున్నాయి - దృష్టి సంబంధమైన ఇబ్బందులున్నాయి - స్పష్టంగా ఎదుటివారికి ఏదీ చెప్పలేక పోతున్నాను వంటివి ద్వితీయ భావ సంబంధితమైన ప్రశ్నలు.

పై సూత్రాలను చూస్తే గ్రహాలు ఆయా స్థానాల్లో ఉండడం వల్ల నత్తి అని, అస్పష్టంగా మాట్లాడతాడని తెలుస్తున్నది. ద్వితీయాధిపతి 6,8,12 స్థానాల్లో ఉన్నా, అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నా, ద్వితీయ కారకుడైన గురుడు వ్యతిరేక స్థానాల్లో ఉన్నా ఇటువంటి లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది. అశుభ గ్రహాలు ద్వితీయంలో, అష్టకవర్గులో ద్వితీయంలో 24 కన్నా తక్కువ బిందువులున్నా వాక్‌, ధన కారకత్వాల్లో లోపాలుంటాయి.

ఆర్థిక బలహీనతలు ఏర్పడడానికి కారణం పూర్వకర్మలలో ఆ యా జాతకులు ధనాన్ని వ్యర్థంగా వినియోగించడం, దానధర్మాలు లేకపోవడం, సమాజాన్ని, ప్రకృతిని బాగా వినియోగించుకోవడమే. అదేవిధంగా ఎదుటివారిలో పరమాత్మను గమనించకుండా ఇష్టం వచ్చినట్లుగా దూషించడం, అపార్థం చేసుకొని ఎదుటివారిని ఇబ్బందులు పెట్టడం, వారిని చూసే దృష్టిలో లోపాలు, ఎదుటివారిని తప్పు భావనతో చూడడం వంటి సమస్యలు పూర్వం చేసి ఉండే అవకాశం ఉంటుంది.

జ్యోతిర్వైద్య ప్రక్రియలో వీరు తమకు కావాలిసినంత మాత్రమే దాచుకుని మిగతా ధనాన్ని పుణ్య కార్యాలకు వినియోగించుకోవాలి. దాని వలన అభివృద్ధి ఉంటుంది. ధనం ప్రవాహశీలం కావాలి కాని దాచుకునే అంశం కాదని వివేచించుకోవాలి. అవసరానికి తగినంత లభిస్తూ మిగిలినది తమకు రావడం, పోవడం ఉంటే, ఆ ధనాన్ని లోకానికి, ప్రకృతికి వినియోగిస్తే పుణ్యబలం వల్ల ధన నిల్వలు పెరుగుతాయి. మాట విలువ పెరగడానికి భౌతికంగా, మానసికంగా మాట్లాడడం తగ్గించాలి. ఎదుటివారి మాటకు విలువ
నిచ్చి, గౌరవించాలి. ప్రకృతిని, సమాజాన్ని, వ్యక్తులను ఆనందమయులుగా, పరమాత్మ స్వరూపాలుగా, చైతన్యమూర్తులుగా చూడడం అలవాటు చేసుకోవాలి. వీని వల్ల ప్రాయశ్చిత్తం జరిగి లోపాల నివారణకు అవకాశం కలిగి జీవితం ఆనందమయం అవుతుంది.

తమ చుట్టూ అపరిమితమైన సంపద గాలి, నీరు, వెలుతురుల రూపంలో ఉన్నదని, తమ శరీరం వెల కట్టలేనంత అత్యున్నతమైనదని, తమ మాటను అందరూ విని ఆనందమయులు అవుతున్నారనే భావనలను బాగా పెంచుకోవడం అవసరం.

డా. ప్రతిభ

 

read related news also..

‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

వారి వారి తత్త్వాలను అనుసరించి లోపాలపై దృష్టి పెట్టకుండా ఎప్పుడూ గుణాలవైపే ఆలోచిస్తూ ప్రయాణం సాగించాలి.