గుంటూరు: టిక్కెట్టు కేటాయింపులో జాప్యం చేయడంతో అలకబూనిన నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ గురువారం నాడు మధ్యాహ్నం పోన్ చేశారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదని ఆయన సూచించారు.

నర్సరావుపేట ఎంపీ స్థానంతో పాటు, సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాన్ని రాయపాటి సాంబశివరావు కోరుతున్నాడు. ఈ విషయమై చంద్రబాబునాయుడు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అలకబూనిన రాయపాటి సాంబశివరావు కుటుంబసభ్యులతో భేటీ అయ్యారు. 

 రాయపాటి సాంబశివరావు అలకబూనిన విషయాన్ని తెలుసుకొన్న లోకేష్ గురువారం నాడు ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. మరోవైపు రాయపాటిని బుజ్జగించేందుకు సుజనా చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రంగంలోకి దిగారు.

సంబంధిత వార్తలు

కుట్రతోనే నాకు వ్యతిరేకంగా నిరసనలు,రాయపాటిపై కోడెల ఇలా....

రాయపాటి అలక, కుటుంబసభ్యులతో భేటీ: రంగంలోకి లగడపాటి, సుజనా

సీట్ల లొల్లి: అసంతృప్తిలో రాయపాటి, పార్టీ వీడేనా?

సత్తెనపల్లి: కోడెల, అంబటిలకు అసమ్మతి బెడద