సత్తెనపల్లి:  సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట  రాయపాటి ఎందుకు టిక్కెట్టు అడుగుతున్నాడని  కోడెల శివప్రసాదరావు ప్రశ్నించారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా గురువారం నాడు కూడ టీడీపీలోని ఓ వర్గం నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.  కోడెల వద్దు అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు.

ఈ విషయమై కోడెల శివప్రసాదరావు ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను తాను వివాదం చేయబోనని కోడెల చెప్పారు.తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారితో తాను స్వయంగా మాట్లాడుతానని కోడెల ప్రకటించారు.

ఈ రకమైన ఆందోళనలు పార్టీకి నష్టం చేస్తాయని కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. తాను  సత్తెనపల్లి నుండి పోటీ చేయకూడదని చెబుతున్న వారంతా కారణం మాత్రం చెప్పడం లేదన్నారు. తనకు బ్యతిరేకంగా సత్తెనపల్లిలో నిరసనలు చేయడం బాధ కల్గించిందన్నారు. కుట్రపూరితంగానే కొందరు ఈ నిరసనలు చేయిస్తున్నారని కోడెల శివప్రసాదరావు  ఆరోపించారు.

సత్తెనపల్లిని ప్రపంచపటంలో పెట్టిన ఘనత  తనదని ఆయన చెప్పారు. 15వేల మెజారిటీతో తాను విజయం సాధిస్తానని కోడెల ధీమాను వ్యక్తం చేశారు.తనను నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని  ఎవరూ కూడ కోరలేదని చెప్పారు. ఇదంతా ప్రచారం మాత్రమేని కోడెల చెప్పారు.

సంబంధిత వార్తలు

రాయపాటి అలక, కుటుంబసభ్యులతో భేటీ: రంగంలోకి లగడపాటి, సుజనా

సీట్ల లొల్లి: అసంతృప్తిలో రాయపాటి, పార్టీ వీడేనా?

సత్తెనపల్లి: కోడెల, అంబటిలకు అసమ్మతి బెడద