ఫ్యాన్స్ పై బాలయ్య వ్యవహారశైలి... టీడీపీకి పెద్ద దెబ్బ?
టాలీవుడ్ లో స్టార్ హీరో ఇమేజ్ ఉన్న బాలయ్య ప్రచారానికి వస్తున్నారంటే మాత్రం.. టీడీపీ నేతల గుండెల్లో గుబులు మొదలౌతోంది. ఆయన వల్ల ఓట్లు రాకపోగా వివాదాలు ఎక్కువౌతున్నాయి.
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు ఇప్పుడు.. టీడీపీ నేతలను కలవరపెడుతోంది. ఎవరైనా సినీ నటుడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే... ఓట్లు ఎక్కువ పడతాయని ఆశిస్తుంటారు. అయితే.. టాలీవుడ్ లో స్టార్ హీరో ఇమేజ్ ఉన్న బాలయ్య ప్రచారానికి వస్తున్నారంటే మాత్రం.. టీడీపీ నేతల గుండెల్లో గుబులు మొదలౌతోంది. ఆయన వల్ల ఓట్లు రాకపోగా వివాదాలు ఎక్కువౌతున్నాయి.
ఒకప్పుడంటే.. ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అందుబాటులో ఉండేది కాదు కానీ.. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఎక్కడ ఏది జరిగినా వెంటనే అందరికీ తెలిసిపోతోంది. మద్దతుగా ఉన్న న్యూస్ పేపర్లు ఎంత కవర్ చేయాలని ప్రయత్నించినా.. ప్రజలు అసలు అక్కడ జరిగింది ఏమిటో కళ్లారా చూడగలుగుతున్నారు. దీంతో.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ బాలయ్య మాత్రం జనాలు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా వ్యవహరించడం గమనార్హం.
మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో బుల్ బుల్ అంటూ అడ్డంగా బుక్కయ్యారు బాలయ్య. ఆ వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. ఇటీవల ఓ వీడియో జర్నలిస్టుని తిట్టారు. ఆ వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. అంతేకాదు.. ఈసారి ఎన్నికల్లో విజయం మీదే అంటూ మద్దతుపలికిన సొంత పార్టీ కార్యకర్తపై కూడా బాలకృష్ణ విపరీతంగా మండిపడ్డారు. అన్నిటికీ మంచి.. విజయనగరం ఎన్నికల ప్రచారంలో ఓ అభిమానిని రోడ్డుపై ఉరికించి మరీ కొట్టారు.
అంతకముందు ఓ మీటింగ్ లో ప్రశ్నించినందుకు సొంత పార్టీ కార్యకర్తపై కూడా చెయ్యిచేసుకున్నారు. తీవ్ర ఆవేదనకు గురైన ఆ కార్యకర్త పార్టీకి రాజీనామా చేసేసాడు.
కాగా.. ఈ వరస సంఘటనలపైనెటిజన్లు ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు. బాలయ్యకు పిచ్చి ముదిరిందని కొందరు ట్వీట్లు చేస్తుండగా.. బాలయ్య పిచ్చి కారణంగా ఏపీలో టీడీపీ గల్లంతు ఖాయమంటూ మరొకరు కామెంట్ చేశారు.
బాలయ్య తీరుని ప్రతిపక్షమైన వైసీపీ అవకాశంగా మార్చుకుంటోంది.బాలయ్య వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇలాంటి వ్యక్తిని మళ్లీ ఎన్నుకోవాలని అనుకుంటున్నారా అని ప్రజలను ప్రశ్నిస్తోంది.
ఒకవైపు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలా అని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో.. బాలయ్య ప్రవర్తిస్తున్న తీరు అసలుకే ఎసరు పెట్టేలా ఉందని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు
మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య.. సొంత పార్టీ నేతపైనే దాడి
‘‘పీక కోస్తా.. నా కొడకా’’.. మళ్లీ నోరుజారిన బాలయ్య (వీడియో)
హిందూపురంలో బాలయ్యకు షాకిచ్చిన మహిళలు...
కార్యకర్తపై చేయి చేసుకున్న బాలయ్య (వీడియో)
బాలయ్య.. తగ్గించుకుంటే మంచిది!
అభిమానులపై బాలయ్య దాడి... భార్య వసుంధర కామెంట్స్