Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య.. తగ్గించుకుంటే మంచిది!

ఈ మధ్య కొట్టడంలో కంట్రోల్ చేసుకుంటూ డైలాగ్స్ తో కాస్త హంగామా చేసేస్తున్నారు. అయితే అధిష్టానం నుంచి హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు కాస్త కంట్రోల్ ఉండాలని వినతి సందేశాలు అందుతున్నాయట.

rumors on balakrishna frustration
Author
Hyderabad, First Published Apr 8, 2019, 1:11 PM IST

నందమూరి బాలకృష్ణ తెలిసి చేస్తారో తెలియక చేస్తారో గాని ఎక్కడికెళ్లినా ఎదో ఒక విషయాన్నీ బాగా వైరల్ అయ్యేలా చేయడం అలవాటే. మాటలతో తడబడటం లేదా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ప్రత్యర్థులకు చిక్కడం కామన్ గా మారింది. ప్రతి నలుగురిలో ముగ్గురి దగ్గర మొబైల్ ఉంటుంది అనే విషయం ఆయనకు గుర్తుందో లేదో?. కానీ కోపం వస్తే ఆలోచించకుండా ఆగ్రహానికి లోనవుతున్నారు. 

ఈ మధ్య కొట్టడంలో కంట్రోల్ చేసుకుంటూ డైలాగ్స్ తో కాస్త హంగామా చేసేస్తున్నారు. అయితే అధిష్టానం నుంచి హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు కాస్త కంట్రోల్ ఉండాలని వినతి సందేశాలు అందుతున్నాయట. చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీ సభ్యులతో ప్రచారాల గురించి చర్చిస్తూనే ఉన్నారు. లోకేష్ బాబు జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. 

కానీ బాలకృష్ణ మాత్రం కోపంలో కంట్రోల్ అవ్వడం లేదు. ఇటీవల కాలంలో కొన్ని విషయాల వల్ల బాలకృష్ణ చాలానే ఫ్రస్ట్రేట్‌ అయినట్లు అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ బయోపి దారుణంగా డిజాస్టర్ అవ్వడం.. బుల్ బుల్ కామెంట్ ఎఫెక్ట్.. తెలంగాణాలో టిడిపి కుప్పకూలడం.. లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవ్వడం.. ఇలాంటి విషయాలే కాకుండా హిందూపురం ప్రజల నుంచి కాస్త విమర్శలు రావడంతో పరిస్థితులన్నీ  ఫ్రస్ట్రేట్‌ అయ్యేలా చేశాయి. 

ఇటీవల ఓ మీడియా ప్రతినిధికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అలాగే ప్రచారాల్లో అరిచి చిరాకు తెప్పించే వారికీ కూడా నాలిక మడతేడుతు కంట్రోల్ లో పెడుతున్నప్పటికీ అధిష్టానంలో గుబులు రేపుతోంది. ఎందుకంటే అది జనాల్లోకి నెగిటివ్ గా వెళితే గెలుపుకు ఎసరు పడ్డట్లే.. అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  బాలయ్య ఆ ఒక్క విషయంలో తగ్గితే బెటర్ అని టీడీపీ శ్రేణుల భావన.  

Follow Us:
Download App:
  • android
  • ios