సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. సొంత పార్టీ కార్యకర్తపైనే దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే చాలా సార్లు బాలయ్య అభిమానుల మీద చెయ్యి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే.. ఈసారి టీడీపీ కార్యకర్తపై చెయ్యి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.

 మరోసారి రెచ్చిపోయారు. ఈసారి సొంత కార్యకర్తపైనే దాడికి పాల్పడ్డారు. దురుసుగా ప్రవర్తించి హంగామా సృష్టించారు. సిరివరం చెరువుకు నీరు విడుదల చేయాలని కోరిన టీడీపీ కార్యకర్త రవికుమార్‌ను బాలకృష్ణ కొట్టారు. ఆగ్రహించిన బాల‌కృష్ణ‌.. రవికుమార్‌ను బయటకు పంపాలని పోలీసులను ఆదేశించాడు. బాలకృష్ణ ఆదేశాలతో రవికుమార్‌ను పోలీసులు బయటకి నెట్టేశారు. మనస్తాపానికి గురైన రవికుమార్ టీడీపీకి రాజీనామా చేశారు. 

రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఓ వీడియో జర్నలిస్టును నరికి పోగులు పెడతానంటూ బాలకృష్ణ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఆయన అభిమానులు, ఇతర సహాయకుల మీద దాడికి పాల్పడి విమర్శలు ఎదుర్కొన్నారు.