Asianet News TeluguAsianet News Telugu

సెంటిమెంట్: కేసీఆర్‌కు కలిసొచ్చినట్టుగా బాబుకు వర్కవుటయ్యేనా

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అనుసరించినట్టుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ చంద్రబాబునాయుడు సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ ఎన్నికల్లో  కేసీఆర్‌కు సెంటిమెంట్ కలిసొచ్చింది, కానీ ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు సెంటిమెంట్ వర్కవుటయ్యేనా అనే  చర్చ సర్వత్రా సాగుతోంది.

chandrababu naidu follows kcr sentiment strategy in andhra pradesh
Author
Amaravathi, First Published Apr 9, 2019, 12:02 PM IST

అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అనుసరించినట్టుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ చంద్రబాబునాయుడు సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ ఎన్నికల్లో  కేసీఆర్‌కు సెంటిమెంట్ కలిసొచ్చింది, కానీ ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు సెంటిమెంట్ వర్కవుటయ్యేనా అనే  చర్చ సర్వత్రా సాగుతోంది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటర్లు 88 సీట్లను కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు ప్రజా కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.

ప్రజా కూటమి తరపున ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రజా కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే అమరావతికి అధికారాన్ని కట్టబెట్టాల్సి వస్తోందని కేసీఆర్ ప్రచారం చేశారు. చంద్రబాబుకు ఊడిగం చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయన్నారు.

అమరావతి వద్దకు వెళ్లే అన్ని అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయని కేసీఆర్ తన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబునాయుడును ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బాబు కూడ కౌంటర్ ఇచ్చారు. 

సెంటిమెంట్‌ అస్త్రం తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బాగా కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడ చంద్రబాబునాయుడు ప్రచారం వల్లే తాము ఘోరంగా ఓటమి పాలైనట్టుగా బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఉపయోగించిన సెంటిమెంట్ అస్త్రాన్ని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కూడ ఉపయోగించుకొంటున్నారు. కేసీఆర్‌, మోడీలతో వైసీపీ చీఫ్ జగన్ కుమ్మక్కయ్యారని ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకించి కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఏపీ రాష్ట్రంలో తాను కోరుకొనే ప్రభుత్వం ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.  నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం హక్కును కోరుకొంటుందని చెప్పారు. మరో వైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి కాకుండా కేసీఆర్ సర్కార్ తాజాగా సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయాన్ని బాబు పదే పదే ఎన్నికల ప్రచార సభల్లో ప్రచారం చేశారు.

ఏపీ ఎన్నికల్లో  టీడీపీని ఓడించేందుకు గాను కేసీఆర్ జగన్‌కు వెయ్యి కోట్లను ఇచ్చాడని బాబు ఆరోపిస్తున్నారు. తనకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనంటూ ప్రచారం చేశారు. కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చి హైద్రాబాద్‌లో ఉన్న లక్ష కోట్ల ఆస్తులను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు చేశారు.

అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రాంతానికి చెందిన వారిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన పదే పదే ప్రస్తావించారు. అంతేకాదు ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని ఇతర పార్టీలు ఏ రకంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించాయో వివరిస్తూ ప్రజల్లో సున్నితమైన అంశంపై చర్చకు పెట్టారు.

అంతే కాదు ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ ఏ రకంగా అడ్డుపడిందనే విషయాలను కూడ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించారు. ఏపీకి అన్యాయం చేసే కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారని చంద్రబాబు పదే పదే ప్రస్తావించారు.

జగన్, కేసీఆర్‌లు ఇద్దరూ ఒక్కటేననే విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా ప్రచారం చేశారు. సోమవారం నాడు పోలవరంపై దాఖలు చేసిన కేసును మంగళవారం లోపుగా విత్ డ్రా చేసుకోనేలా కేసీఆర్ ను ఒప్పించాలని జగన్ కు బాబు సవాల్ విసిరారు.

అయితే ఈ సవాల్‌పై  సోమవారం సాయంత్రం తెలంగాణలోని వికారాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ స్పందించారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు అభ్యంతరం లేదని కేసీఆర్ ప్రకటించారు. జగన్ విజయం ఖాయమన్నారు. బాబు ఖేల్ ఖతమైందని తనదైన ధోరణిలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో స్పందించారు. తెలంగాణ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలన్నారు. పోలవరం పై కేసును ఉప సంహరించుకోవాలన్నారు. జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని మరోసారి రుజువైందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

వారం రోజులుగా తాను కేసీఆర్‌ను ఉతికి ఆరేసినట్టుగా బాబు చెప్పారు. కేసీఆర్ ఏనాడు కూడ నిజాలు మాట్లాడలేదన్నారు. ప్రతి సమయంలో కూడ కేసీఆర్ అబద్దాలు ఆడేవాడని బాబు గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను బాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో  సెంటిమెంట్  అస్త్రం టీఆర్ఎస్‌కు ఉపయోగపడింది. భావోద్వేగాలను రగిల్చడంలో కేసీఆర్‌ దిట్టగా పేరుంది. ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకమైన సమయంలో కూడ ఉప ఎన్నికల ద్వారా టీఆర్ఎస్‌ను నిలబెట్టిన చరిత్ర కేసీఆర్‌కు ఉంది.  తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏపీలో ఉండవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

ఏపీలో కుల ప్రభావం కూడ ఎన్నికలపై ప్రధానంగా ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు ప్రయోగిస్తున్న సెంటిమెంట్ అస్త్రం ఏ మేరకు బాబుకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందనేది మే 23వ తేదీన తేలనుంది.


సంబంధిత వార్తలు

టైమ్స్‌నౌ - వీఎంఆర్ సర్వే: మళ్లీ మోడీదే అధికారం

రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: తెలంగాణలో కారుదే జోరు, కాంగ్రెస్ బేజారు

రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: జగన్‌పై చంద్రబాబుదే పైచేయి

రూరల్ మీడియా సర్వే: చంద్రబాబు వర్సెస్ జగన్, ప్లస్ లూ, మైనస్‌లూ

రూరల్ మీడియా సర్వే: ఏపీలో జిల్లాల వారీగా పార్టీలకు వచ్చే సీట్లివే

సర్వే: మెజారిటీ ఎంపీ సీట్లు బాబుకే, జగన్‌కు 9 సీట్లే

అసెంబ్లీ ఎన్నికల సర్వే: బాబుదే పై చేయి, వెనుకంజలో జగన్, పవన్ జీరో

తాజా సర్వే: జగన్‌దే హవా, పవన్ నామమాత్రమే

Follow Us:
Download App:
  • android
  • ios