అమరావతి: ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోనుందని న్యూస్ ఎక్స్‌ ఛానెల్ ప్రకటించింది. న్యూస్ ఎక్స్- యూ ట్యూబ్ సంయుక్తంగా  ఈ పోల్ సర్వేను ప్రకటించింది.

ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్ధిని ఎంపీగా ఎన్నుకొంటారనే ప్రశ్నకు 43 శాతం మంది టీడీపీ వైపే మొగ్గు చూపారని ఆ సంస్థ ప్రకటించింది. గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ మరో ఎంపీ సీటును ఎక్కువగా  గెలుచుకొనే అవకాశం ఉంటుందని ఆ సర్వే ప్రకటించింది. 37 శాతం ఓట్లతో వైసీపీ 9 స్థానాలను కైవసం చేసుకొంటుందని ఆ సంస్థ ప్రకటించింది.

వైసీపీ కూడ గత ఎన్నికలతో పోలిస్తే అదనంగా మరో సీటును గెలుచుకొనే అవకాశం ఉందని  న్యూస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది. గత ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకొన్న బీజేపీ రెండు ఎంపీ స్థానాలను గెలుచుకొంది. అయితే ఈ దఫా మాత్రం ఒక్క స్థానం కూడ గెలుచుకొనే అవకాశం లేదని  ఆ సంస్థ ప్రకటించింది. 37 శాతం ఓట్లతో 9 ఎంపీ స్థానాలను వైసీపీ గెలుచుకొనే  అవకాశం ఉందని  న్యూస్ ఎక్స్ స్పష్టం చేసింది.

ఈ ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆ  సంస్థ అభిప్రాయపడింది. కాంగ్రెస్ కు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని  ఆ సంస్థ చెబుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకొన్న నరసాపురం, విశాఖపట్టణం ఎంపీ స్థానాలను టీడీపీ, వైసీపీ పంచుకొనే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది.

ఇక ఇతర పార్టీలకు 7 శాతం ఓట్లు వస్తాయని ఈ సంస్థ ప్రకటించింది. ఇతరుల్లో జనసేన కూటమి ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


సంబంధిత వార్తలు

అసెంబ్లీ ఎన్నికల సర్వే: బాబుదే పై చేయి, వెనుకంజలో జగన్, పవన్ జీరో

తాజా సర్వే: జగన్‌దే హవా, పవన్ నామమాత్రమే