న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో  మరోసారి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు మరింత మెరుగయ్యాయని టైమ్స్‌ నౌ- వీఎంఆర్ సర్వే తేల్చి చెప్పింది. ఈ దఫా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 279 ఎంపీ సీట్లను గెలుచుకొనే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చి చెప్పింది.

పాకిస్తాన్‌ భూభాగంలోని బాలకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియా వైమానిక దాడులకు పాల్పడడం, రైతులకు పెట్టుబడి సాయం అందించడం, అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు వంటి  నిర్ణయాలు మోడీకి కలిసి వచ్చాయని ఆ సంస్థ ప్రకటించింది.

ఈ ఎన్నికల్లో ప్రజలను ఈ మూడు అంశాలు ప్రభావితం చేయనున్నాయని ఆ సంస్థ అభిప్రాయపడింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీయేకు ఈ దఫా 50 ఎంపీ సీట్లు తక్కువగా వచ్చే అవకాశం ఉందని  ఆ సంస్థ స్పష్టం చేసింది.

43 శాతం మంది మరోసారి మోడీయే ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకొన్నారని ఆ సర్వే నివేదికలు చెబుతున్నాయి. 80 ఎంపీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమిని తట్టుకొని బీజేపీ 50 ఎంపీ స్థానాలు గెలుచుకొంటుందన ఈ సర్వే చెబుతోంది. అయితే గత ఎన్నికల్లో ఇదే రాష్ట్రం నుండి బీజేపీకి 71 ఎంపీ స్థానాలు దక్కాయి.

ఈ ఎన్నికల్లో  యూపీఏ పుంజుకొంటుందని కూడ ఈ సర్వే చెబుతోంది. లోక్‌సభలో యూపీఏ బలం 64 నుండి 149‌ స్థానాలకు పెరిగే అవకాశం ఉందని సర్వే నివేదికలు వెల్లడించాయి.   తృణమూల్, బీఎస్పీ, ఎస్పీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీలకు 115 ఎంపీ సీట్లు దక్కే అవకాశాలున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడ గెలుచుకొనే అవకాశం లేదని  ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏపీలో వైసీపీకి 20, టీడీపీకి 5 ఎంపీ స్థానాలు దక్కుతాయని ఆ సంస్థ తేల్చింది. 19 రాష్ట్రాల్లో 14 వేల మంది అభిప్రాయాలను సేకరించినట్టుగా టైమ్స్ నౌ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: తెలంగాణలో కారుదే జోరు, కాంగ్రెస్ బేజారు

రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: జగన్‌పై చంద్రబాబుదే పైచేయి

రూరల్ మీడియా సర్వే: చంద్రబాబు వర్సెస్ జగన్, ప్లస్ లూ, మైనస్‌లూ

రూరల్ మీడియా సర్వే: ఏపీలో జిల్లాల వారీగా పార్టీలకు వచ్చే సీట్లివే

సర్వే: మెజారిటీ ఎంపీ సీట్లు బాబుకే, జగన్‌కు 9 సీట్లే

అసెంబ్లీ ఎన్నికల సర్వే: బాబుదే పై చేయి, వెనుకంజలో జగన్, పవన్ జీరో

తాజా సర్వే: జగన్‌దే హవా, పవన్ నామమాత్రమే