Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ ఎన్నికల సర్వే: బాబుదే పై చేయి, వెనుకంజలో జగన్, పవన్ జీరో

ఈ నెల 11వ తేదీన ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో  టీడీపీ మరోసారి  విజయం సాధించనుందని న్యూస్ ఎక్స్‌ పోల్ స్ట్రాట్ సర్వే తేల్చింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా టీడీపీ 10 అసెంబ్లీ సీట్లను కోల్పోయే అవకాశం ఉందని  ఆ సంస్థ ప్రకటించింది.

chandrababu will get majority assembly seats in andhra pradesh in upcoming elections
Author
Amaravathi, First Published Apr 5, 2019, 11:59 AM IST

అమరావతి: ఈ నెల 11వ తేదీన ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో  టీడీపీ మరోసారి  విజయం సాధించనుందని న్యూస్ ఎక్స్‌ పోల్ స్ట్రాట్ సర్వే తేల్చింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా టీడీపీ 10 అసెంబ్లీ సీట్లను కోల్పోయే అవకాశం ఉందని  ఆ సంస్థ ప్రకటించింది.

2014 ఎన్నికల్లో టీడీపీకి 102 అసెంబ్లీ స్తానాలు దక్కాయి. ఆ తర్వాత వైసీపీ నుండి  మరో 23 మంది ఎమ్మెల్యేలు కూడ టీడీపీలో చేరారు. ఈ దఫా ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 92 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోనుంది.

వైసీపీ గత ఎన్నికలతో పోలిస్తే మరో 10 సీట్లను అదనంగా గెలుచుకొనే అవకాశం ఉందని ఈ సర్వే  ప్రకటించింది. టీడీపీకి ఈ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు వస్తాయని  ఆ సంస్థ తేల్చి చెప్పింది. వైసీపీ గత ఎన్నికలతో పోలిస్తే అదనంగా పది సీట్లు దక్కించుకొని 77 సీట్లు సాధించే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రకటించింది. వైసీపీకి 35 శాతం ఓట్లు వస్తాయని  కూడ ఆ సంస్థ చెబుతోంది.

వైసీపీ, టీడీపీకి మధ్య రెండు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంటుందని ఆ సంస్త ప్రకటించింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడ దక్కించుకొని కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 13 శాతం ఓట్లతో కనీసం నాలుగు అసెంబ్లీ స్థానాలను దక్కించుకొనే అవకాశం ఉందని  ఆ సంస్థ ప్రకటించింది.

ఈ ఎన్నికల్లో బీజేపీకి 9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని న్యూస్ ఎక్స్ ‌పోల్ స్టాట్ సర్వే తేల్చింది. కనీసం ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని  ఆ సంస్థ అభిప్రాయపడింది. జనసేనకు ఒక్క స్థానం కూడ ఈ సంస్థ ఇవ్వలేదు. అయితే ఇతరులు ఒక్క స్థానంలో విజయం సాధిస్తారని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఆ ఒక్క స్థానం పవన్ కళ్యాణ్‌ పార్టీకి చెందుతుందా... లేదా ఇండిపెండెంట్ అభ్యర్ధులు విజయం సాధిస్తారా అనే విషయమై ఆ సంస్థ కచ్చితంగా చెప్పలేదు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు 46 శాతం మంది ఓటేస్తే జగన్‌కు39 శాతం మాత్రమే ఓటు చేశారని ఆ సంస్థ తేల్చింది.  ఇతరులకు 10 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. 5 శాతం మంది మాత్రం తాము సీఎం ఎవరు ఉండాలనే విషయమై పెద్దగా పట్టించుకోవడం లేదు.

రాష్ట్రంలో  టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని 43 శాతం మంది, వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని 37 శాతం, కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయని 6 శాతం మంది, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని 7 శాతం మంది చెప్పినట్టుగా  ఆ సంస్థ ప్రకటించింది.ఈ సర్వేపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ స్పందించారు.ఈ సర్వే కంటే తమకు ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

తాజా సర్వే: జగన్‌దే హవా, పవన్ నామమాత్రమే
 

Follow Us:
Download App:
  • android
  • ios