అమరావతి: సినీనటు మోహన్ బాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు  సినీనటుడు శివాజీ. మోహన్ బాబు విద్యాసంస్థలను వ్యాపార ప్రయోజనాల కోసమే నడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీనటుడు మోహన్ బాబు శుక్రవారం తిరుపతిలో విద్యార్థులు, తనయులతో కలిసి నిరసనకు దిగిన విషయం తెలిసిందే.  

ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మోహన్ బాబు ఎప్పుడైనా మాట్లాడారా అంటూ నిలదీశారు. హక్కులు అడిగే సమయంలో బాధ్యతలు కూడా గుర్తుకు రావాలి అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు మోహన్ బాబు నిరసనపై టీడీపీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

ఫీజు రీయింబర్స్ మెంట్ పై మోహన్ బాబు చీప్ గా వ్యవహరించారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. మోహన్ బాబు విద్యాదానం చేస్తున్నారా లేక బిజినెస్ చేస్తున్నారా అంటూ విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ కోసమే మోహన్ బాబు నిరసనకు దిగారంటూ టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ కోసమే ధర్నా చేశారు: మోహన్‌బాబుపై కుటుంబరావు ఫైర్

నా పార్టీ అంటావేంటి, అంత అహంకారమా: బాబుపై మోహన్ బాబు నిప్పులు

చంద్రబాబు ప్రభుత్వంపై మోహన్ బాబు పోరు (వీడియో)

రోడ్డుపై బైఠాయించిన మోహన్ బాబు, మంచు మనోజ్

సినీ నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్ట్: ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు