Asianet News TeluguAsianet News Telugu

నా పార్టీ అంటావేంటి, అంత అహంకారమా: బాబుపై మోహన్ బాబు నిప్పులు

చంద్రబాబు అంటే నాకిష్టమేనని, కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదని మోహన్ బాబు అన్నారు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారని, అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారని అన్నారు.

Cine actor Mohan Babu slams CM Chandrababu
Author
Tirupati, First Published Mar 22, 2019, 1:25 PM IST

తిరుపతి : కాలం ఎల్లవేళలా మనది కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌ బాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి రావల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆయన శుక్రవారం తిరుపతిలో విద్యార‍్థులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ ధర్నా కార్యక్రమంలో మంచు విష్ణు, మనోజ్‌ కూడా పాల్గొన్నారు. 

చంద్రబాబు అంటే నాకిష్టమేనని, కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదని మోహన్ బాబు అన్నారు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారని, అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారని అన్నారు. ప్రజలు అమాయకులు కాబట్టి చంద్రబాబును నమ్మి, ఓట్లు వేసి గెలిపించారని, చివరకు చంద్రబాబు అందర్నీ మోసం చేశారని అన్నారు. ఫీజులే చెల్లించని చంద్రబాబు ఇంకా యువతకు ఏమి ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారని మోహన్ బాబు అన్నారు. అలాగే మహానుభావుడు ఎన్టీఆర్‌ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారని, మంచి చేసే ముఖ్యమంత్రులను ఎవరైనా అభిమానిస్తారుని అన్నారు. 

"కానీ నువ్వు మాత్రం అలా కాదు. ఆ ముఖ్యమంత్రులు ఆ పథకాలు ప్రారంభిస్తే నేను ఎందుకు ఇవ్వాలని చెప్పు అప్రిషియేట్‌ చేస్తా. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నమ్మి ఓటు వేస్తే నీచంగా మోసం చేశావు" అని చంద్రబాబు అన్నారు.

మహానుభావుడు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయనకే సభ్యత్వం లేకుండా చేశారని మోహన్ బాబు అన్నారు. "అసలు టీడీపీ నీది కాదు. నీవు అన్నగారి వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నావు. ఆయనపై ఉన్న అభిమానంతోనే నేతలు ఆ పార్టీలో ఉన్నారు" అని అన్నారు. 

"నా పార్టీ నా పార్టీ అంటావేంటి చంద్రబాబు...అది ఎన్టీఆర్‌ పార్టీ. సరే నీ కర్మ, దానితో నాకు సంబంధం లేదు. ప్రజలే బుద్ధి చెబుతారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని లేఖ రాస్తే అంత పొగరా?, అహంకారామా?" అని అన్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబు ప్రభుత్వంపై మోహన్ బాబు పోరు (వీడియో)

రోడ్డుపై బైఠాయించిన మోహన్ బాబు, మంచు మనోజ్

సినీ నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్ట్: ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

Follow Us:
Download App:
  • android
  • ios