2014-15 సంవత్సరంలో మోహన్‌బాబు సారథ్యంలోని విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.7,051 మాత్రమేనన్నారు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు.

ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు రావడం లేదంటూ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు తిరుపతిలో ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో కుటుంబరావు మీడియాతో మాట్లాడారు.

2015-16 ఆర్ధిక సంవత్సరంలో రూ.2,69,000, 2016-17 సంవత్సరంలో రూ.64,000, 2017-18లో 1.86 కోట్లు, 2018-19తో రావాల్సిన బకాయిలతో కలిపి మొత్తం రూ. 6 కోట్ల 43 లక్షలని కుటుంబరావు తెలిపారు.

దీనిలో అత్యధిక మొత్తమైన రూ.4 కోట్ల 58 లక్షలన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను ఆర్ధిక సంవత్సరం మొదట్లోనే ఇవ్వాలంటున్నారని దీనిని చూస్తే ఆయన విద్యాసంస్థను నడిపిస్తున్నారా..? బిజినెస్ చేస్తున్నారా అన్నది అర్థం కావడం లేదన్నారు.

విద్యార్థుల అడ్మిషన్లు, జాయినింగ్ ప్రక్రియ అంతా సెకండ్ క్వార్టర్‌లో పూర్తవుతుందని ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదలయ్యేది ఆ తర్వాతేనని కుటుంబరావు తెలిపారు. మోహన్‌బాబు ఎలాంటి లాజిక్ లేకుండా కక్షతో, ముఖ్యమంత్రిని బద్నాం చేయాలనే ఆలోచనతోనే మోహన్ బాబు మాట్లాడారన్నారని ఆరోపించారు.

నా స్కూళ్లు, కాలేజీలలో 25 శాతం మందిని ఉచితంగా చదివిస్తున్నానని మోహన్ బాబు చెబుతున్నారని.. అయితే ఆయన విద్యాసంస్థల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఫీజు రియంబర్స్‌మెంట్‌ను మోహన్‌బాబు క్లైమ్ చేసుకుంటున్నారని కుటుంబరావు ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ సొమ్ము తీసుకుని తాను 25 శాతం మందిని ఉచితంగా చదవిస్తున్నానని మోహన్‌బాబు గొప్పలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. మోహన్‌బాబు ఫీజు రీయంబర్స్‌మెంట్ క్లయిమ్ చేసుకుంటున్నారో లేదో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.

తాను చెప్పిన అంశాల్లో ఏమైనా తప్పులు ఉంటే బహిరంగంగా క్షమాపణ చెబుతానన్నారు. ప్రతిపక్షానికి మద్ధతు పలికేలా మోహన్‌బాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో బాకీపడిన ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు రూ.2, 500 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం తీర్చిందని కుటుంబరావు గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

నా పార్టీ అంటావేంటి, అంత అహంకారమా: బాబుపై మోహన్ బాబు నిప్పులు

చంద్రబాబు ప్రభుత్వంపై మోహన్ బాబు పోరు (వీడియో)

రోడ్డుపై బైఠాయించిన మోహన్ బాబు, మంచు మనోజ్

సినీ నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్ట్: ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు