తిరుపతి: పీజు రీ ఎంబర్స్‌మెంట్‌  బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శ్రీ విద్యానికేతన్ యజమాని మోహన్ బాబు ఆందోళనకు దిగారు.

శుక్రవారం నాడు తిరుపతి-మదనపల్లి రోడ్డుపై బైఠాయించి  మోహన్ బాబు నిరసనకు దిగారు.  మోహన్‌బాబుతో పాటు సినీ నటుడు మంచు మనోజ్ కూడ ఈ నిరసనలో పాల్గొన్నారు.

ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ బకాయిలను సకాలంలో చెల్లించాలని  కోరుతూ మోహన్ బాబు డిమాండ్ చేశారు. నాలుగున్నర ఏళ్లుగా బాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.

ఎన్నికల ముందు అనేక వ్యర్థ వాగ్ధానాలను ఇచ్చారని మోహన్ బాబు ఆరోపించారు. 2017-18 విద్యాసంవత్సరంలో రూ. 2 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. కానీ, ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు.

చంద్రబాబుకు కష్టంలో ఉన్న సమయంలో తాను, తన విద్యార్థులు అండగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.  ప్రజల నుండి దోచుకొన్న సొమ్మునే వాగ్ధానాల రూపంలో తిరిగి చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు.

నాలుగున్నర ఏళ్లుగా బాబుకు మహిళలు గుర్తుకు రాలేదన్నారు. ఇప్పుడేమో మహిళలకు పసుపు కుంకుమ పేరుతో తాయిలాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.తమ సంస్థకు చెల్లించాల్సిన ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే ఇవ్వాలని  ఆయన డిమాండ్ చేశారు.