చంద్రబాబునాయుడు ఎన్ని పన్నాగాలు పన్నినా కూడ ఈ దఫా రాష్ట్రంలో తమ ప్రభుత్వమే వస్తోందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు.
పులివెందుల: చంద్రబాబునాయుడు ఎన్ని పన్నాగాలు పన్నినా కూడ ఈ దఫా రాష్ట్రంలో తమ ప్రభుత్వమే వస్తోందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు.
శుక్రవారం నాడు పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. పులివెందులలో పుట్టినందుకు గర్వపడుతున్నట్టు ఆయన చెప్పారు. వైఎస్ హాయంలోనే పులివెందులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకొన్నాయని ఆయన గుర్తు చేశారు. ట్రిపుల్ ఐటీ, జేఎన్‌టీయూ వైఎస్ఆర్ సీఎంగా ఉన్న కాలంలోనే పులివెందులకు వచ్చాయని ఆయన తెలిపారు.
చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఎంతో సౌమ్యుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. చిన్నాన్నకు వీళ్లే చంపించారని ఆయన మరోసారి టీడీపీపై విరుచుకుపడ్డారు. బురద చల్లేది వీరే.. తప్పుడు ఎంక్వైరీ రిపోర్టులు కూడ ఇచ్చేదీ వీరేనని జగన్ టీడీపీపై విరుచుకుపడ్డారు. తన అధికారం కోసం ఎన్టీఆర్‌పై ఆనాడు బాబు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.మీరు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుకు మార్పు కానుందని ఆయన తెలిపారు.
సంబంధిత వార్తలు
మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏం చేశాడో తెలియదా: జగన్
తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు
వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు
వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ
తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి
వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు
శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు
