పులివెందుల: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విమర్శించారు. ప్రతిపక్షం ఓట్లను చీల్చేందుకు చంద్రబాబునాయుడు డ్రామాలు ఆడుతున్నాడని ఆయన చెప్పారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ శుక్రవారం నాడు పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. విశాఖ జిల్లా గాజువాకలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసే సమయంలో టీడీపీ, జనసేన జెండాలు కూడ కన్పించాయని చెప్పారు. 

టీడీపీ, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణలు కలిసి ఏ పనులు చేశారో మీకు తెలుసుననని ఆయన చెప్పారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు భీమిలి నుండి చంద్రబాబునాయుడు టీడీపీ టిక్కెట్టు ఇవ్వాలని భావించారని జగన్ గుర్తు చేశారు.

అయితే ప్రజా వ్యతిరేకతను గుర్తించి తన పార్ట్‌నర్ పార్టీలో లక్ష్మీనారాయణను చేర్పించి విశాఖ ఎంపీ సీటు ఇప్పించాడని జగన్ ఆరోపణలు చేశారు.