మంగళగిరి: పాడి,పంట మన సంస్కృతిలో భాగం. ప్రకృతిని ప్రేమించే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ కు వ్యవసాయమన్నా, పశు పోషణ అన్నా అమితమైన ఇష్టం. రైతు జీవితం... పాడి, పంట కలనేత అని చెబుతారు జనసేనాని. 

వీలు చిక్కినప్పుడల్లా స్వయంగా అటు వ్యవసాయం చేస్తారు. ఇటు గోవులకు సేవ చేస్తూ ఉంటారు. అందుకే పార్టీ మూల సిద్ధాంతాలలో ‘సంస్కృతుల్ని  కాపాడే సమాజం’ అంటూ వాటికి పెద్ద పీట వేశారు. విషయానికి వస్తే మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేశారు. 

ఈ రోజు గురువారం  సాయంత్రం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి  చేరుకోగానే గోమాతలకు మేత వేసి వాటి ఆలనాపాలన గురించి వాకబు చేశారు.