విజయవాడ : ఏపీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, జవహర్, ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీలపై వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. దళితుల పేరుతో వైఎస్‌ జగన్‌పై కారుకూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

వైఎస్‌ జగన్‌పై దాడి విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు అనైతికంగా మాట్లాడుతూ, పశువుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నక్కా ఆనంద్‌ బాబు, కారెం శివాజి, జవహర్‌లు దళితులైనంతా మాత్రాన వైఎస్‌ జగన్‌ గురించి ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు.

దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకోరన్న చంద్రబాబు వద్ద పని చేస్తూ వైఎస్‌ జగన్‌ను అరెస్ట్‌ చేస్తామని చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు అంత సత్తా ఉంటే అరెస్ట్‌ చేయించండంటూ సవాల్‌ విసిరారు. వైఎస్‌ జగన్‌ను చంపడానికి విజయమ్మ, షర్మిల ప్లాన్‌ చేశారని ఏకలవ్యుడు లాంటి నేతలు ఆరోపిస్తున్నారు.. మీ నోట్లో ఏమన్నా అశుద్దం పోసుకున్నారా అంటూ ధ్వజమెత్తారు. 

నక్కా ఆనంద్‌, కారెం శివాజి, జవహర్‌లు దళితులని వారి చేత వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారని మేరుగ మండిపడ్డారు. దళితుల పేరుతో మా నాయకుడి గురించి కారు కూతలు కూస్తే చూస్తూ ఊరుకోమన్నారు. అంబేడ్కర్‌ దయతో పదవులు పొందిన మీరు చంద్రబాబు దగ్గర చప్రాసీ ఉద్యోగం చేస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి తెగబలిసి మాట్లాడుతున్నారని ఆరోపించారు.  

3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అని ఆయనను అరెస్ట్ చేసే సత్తా టీడీపీకి లేదన్నారు. వైఎస్‌ జగన్‌ చమట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలను చంద్రబాబు సంతలో పశువుల్లా కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 

దమ్ముంటే మీ రాజీనామాలను చంద్రబాబు ముఖాన విసిరేసి ప్రజాక్షేత్రంలోకి రండని సవాల్ విసిరారు. అంతేకానీ దళితులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టొద్దని కోరారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన ఒక్క దళితుడు కూడా వైఎస్‌ జగన్‌ నుంచి పక్కకు వెళ్లరని మేరుగు ధీమా వ్యక్తం చేశారు.
 

ఈ వార్తలు కూడా చదవండి

మల్లెల బాబ్జీకి పట్టిన గతే శ్రీనివాస్ కు,శివాజీ కూడా కుట్రదారుడే :తమ్మినేని దాడి కేసు విచారణపై హైకోర్టులో జగన్ పిటిషన్....ప్రతివాదిగా చంద్రబాబు జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు