జగన్‌పై దాడి, రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ని కలిసిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసులతో కాకుండా దేశంలోని ఏ ఇతర ఏజెన్సీ ద్వారా విచారణ జరిపిన ఈ దాడి వెనుకున్నది ఎవరో తెలుస్తుందని వారు రాజ్‌నాథ్‌కు తెలిపారు.

కేంద్ర దర్యాప్తుతో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా వారు హోంమంత్రిని కోరారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై దాడి ఘటన కేసు కేంద్ర పరిధిలో ఉందని చంద్రబాబు చెప్పడంతో.. కేంద్రం ఏం చేయగలదో అది చేస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చిందన్నారు.

మరో నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడ వెనుక ఎవరున్నారో.. హీరో శివాజీకి జరుగుతున్న విషయాలు ముందే ఎలా తెలుసో దానిపైనా విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. నిందితుడిని వైసీపీ సానుభూతిపరుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. చంద్రబాబు గత చరిత్రపైనా విచారణ జరపాల్సిందిగా రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.

రిమాండ్ రిపోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగిందని స్పష్టమైంది.. నిందితుడు చేయాలనుకున్న విధంగా చేసి ఉంటే.. జగన్ ప్రాణాలు కోల్పోయేవారని మాజీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఇలాంటి అంశాన్ని ప్రభుత్వం, డీజీపీ చాలా చిన్నదిగా చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట\

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

వాంగ్మూలం ఎందుకివ్వడు.. జగన్‌పై కేసు వేస్తా: మంత్రి పితాని

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

ఆపరేషన్ గరుడలో మరో కుట్రను బయటపెట్టిన శివాజీ