ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న వైఎస్ జగన్ తనకు డబ్బుపై వ్యామోహం లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు నాయుడులా అడ్డదిడ్డంగా మాట్లాడనని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు నాయుడిలా తప్పుడు హామీలు ఇచ్చే వ్యక్తిని కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక అమలు చేసే వ్యక్తిని అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏ పథకం ప్రవేశపెట్టినా కమిషన్ ఆశించే చేస్తాడని తాను మాత్రం అలా చెయ్యనని ప్రజలకు ఏది మంచిది అయితే అదే చేస్తామని స్పష్టం చేశారు. 

తనకు డబ్బుపై వ్యామోహం లేదని ప్రజలకు నిస్వార్థంగా సేవ చెయ్యడమే తన లక్ష్యమన్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే 30 ఏళ్ల అద్భుత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. తన పాలన ఎలా ఉంటుందంటే తాను చనిపోయిన తర్వాత తన తండ్రిని ఎలా అయితే పూజిస్తున్నారో అలానే తనను కూడా పూజించేంత అద్భుత పాలన అందిస్తామన్నారు. 

చనిపోయిన తర్వాత తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. తాను 341 రోజులపాటు 3648 కిలోమీటర్లు నడిచానని ప్రజల గుండెచప్పుడు తెలుసుకున్నానని తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. 

ఈ అవినీతిమయమైన పాలనను అంతమెుందించాలంటే ప్రజలంతా తనకు కలిసి రావాలని కోరారు. మీ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చానని తనను ఆశీర్వదించాలని కోరారు. ఇంకా ఎన్నికలకు మూడు నెలల సమయం ఉందని ప్రజలు ఆలోచించి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు వైఎస్ జగన్.

ఈ వార్తలు కూడా చదవండి

గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు, ఇంటికే ప్రభుత్వ పథకాలు: వైఎస్ జగన్

రైతులకు వైఎస్ జగన్ వరాల జల్లు

ఏపీలోని 13 జిల్లాలను 25కి పెంచుతా: ముగింపు సభలో వైఎస్ జగన్

బాబు పాలనలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి : జగన్

పాదయాత్ర ముగింపు సభలో జగన్: నిరుద్యోగులను మోసం చేసిన బాబు

జాతీయ రాజకీయాల పేరుతో చంద్రబాబు డ్రామాలు

ముగిసిన పాదయాత్ర: చంద్రబాబుపై మండిపడ్డ జగన్

ముగిసిన ప్రజాసంకల్పయాత్ర: పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్