శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తే పరిపాలన మరింత సౌలభ్యంగా ఉంటుందన్నారు. 

జిల్లాలలో కలెక్టర్ వ్యవస్థను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పరిధిలో ఏడు నియోజవకర్గాలు మాత్రమే ఉండేలా చూస్తానన్నారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో అయితే కలెక్టర్ అద్భుతమైన పాలన అందిస్తారని తెలిపారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 25 రాష్ట్రాలుగా విభజిస్తానని పరిపాలనను ప్రతీ ఒక్కరికీ అందిస్తానన్నారు. ప్రతీ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బాబు పాలనలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి : జగన్

పాదయాత్ర ముగింపు సభలో జగన్: నిరుద్యోగులను మోసం చేసిన బాబు

జాతీయ రాజకీయాల పేరుతో చంద్రబాబు డ్రామాలు

ముగిసిన పాదయాత్ర: చంద్రబాబుపై మండిపడ్డ జగన్

ముగిసిన ప్రజాసంకల్పయాత్ర: పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్