ఇచ్ఛాపురం: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నీరుగార్చిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న జగన్ ఆరోగ్య శ్రీ పథకం సేవలపై మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే చాలా భారంగా ఉందన్నారు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా అద్భుత వైద్యం చేయించుకునే పేదలు ఇప్పుడు ఆ సేవలు పొందలేకపోతున్నారని ఆరోపించారు. 

దాదాపు ఆరోశ్రీ పథకానికి సంబంధించి ఎనిమిది నెలలుగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసిన పరిస్థితి నెలకొందని జగన్ ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ అయిపోయాయని తెలిపారు. నేడు రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు పొందలేని దుస్థితి నెలకొందన్నారు.  
 
ఉద్దానంలో 4వేలు మంది డయాలసిస్ రోగులు ఉంటే కేవలం 1400 మందికి మాత్రమే ఉచిత డయాలసిస్ చేస్తుందని మిగిలిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారని ఓపిక ఉన్నంత వరకు చేయించుకుని ఆతర్వాత చనిపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

కిడ్నీ రోగులు ఎలాంటి పనిచెయ్యకుండా నానా బాధలు పడుతున్నారని తాను వారి బాధలను చూసి చలించిపోయానని చెప్పుకొచ్చారు. పింఛన్ అయినా ఇచ్చి ఆదుకుంటారని వారు ఆశిస్తే ఆ ఆశలు కూడా ఆడియాసలుగా మిగిలాయని ఆరోపించారు. 4వేల ముందు రోగులు ఉంటే కేవలం 370 మందికి మాత్రమే పింఛన్ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఆ పింఛన్ కూడా ముష్టి వేసినట్లు కేవలం రూ.2500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకవైపు ఆపదలో ఉన్నప్పుడు సంజీవనిలా ఆదుకునే 108 నేడు మూగబోతుందని ఆరోపించారు. కుయ్ కుయ్ మంటూ వచ్చే అంబులెన్స్ ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఇంత అన్యాయమైన పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని జగన్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పాదయాత్ర ముగింపు సభలో జగన్: నిరుద్యోగులను మోసం చేసిన బాబు

జాతీయ రాజకీయాల పేరుతో చంద్రబాబు డ్రామాలు

ముగిసిన పాదయాత్ర: చంద్రబాబుపై మండిపడ్డ జగన్

ముగిసిన ప్రజాసంకల్పయాత్ర: పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్