Asianet News TeluguAsianet News Telugu

రైతులకు వైఎస్ జగన్ వరాల జల్లు

ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారు. రైతును రాజుగా చెయ్యడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమంటూ  జగన్ ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న వైఎస్ జగన్ రైతులకు వరాల  జల్లు కురిపించారు. 
 

ys jagan gifts from formers
Author
Ichapuram, First Published Jan 9, 2019, 5:49 PM IST

ఇచ్చాపురం: ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారు. రైతును రాజుగా చెయ్యడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమంటూ  జగన్ ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న వైఎస్ జగన్ రైతులకు వరాల  జల్లు కురిపించారు. 

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు పగటి పూట తొమ్మిది గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. అలాగే బ్యాంకుల్లో జీరో వడ్డీతో రుణాలు ఇప్పిస్తామన్నారు. బ్యాకులు రుణాలు ఇవ్వకపోతే సహించేది లేదన్నారు. 

అలాగే రెండున్నర ఎకరాలు లోపు ఉన్న ప్రతీ రైతుకు మేనెలలో పంట వేసేసమయానికి అంటే మే నెలలో సంవత్సరానికి రూ.12,500 రూపాయలు నేరుగా అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.12,500లను నేరుగా రైతు చేతుల్లోనే పెడతామని స్పష్టం చేశారు. 

మరోవైపు రైతుకు ఉచితంగా బోర్లు వేయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. బోర్లు వేయించేందుకు ఎక్కడా రూపాయి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదన్నారు. ఉచితంగానే బోర్లు వేయించి రైతు ఇంట సిరులు కురిపిస్తామన్నారు. 

ఆక్వారంగానికి సైతం వైఎస్ జగన్ మరింత వెసులుబాటు కల్పించారు. విద్యుత్ చార్జీ యూనిట్ ధర రూ.1.50కే అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. రైతుల పంటలు నష్టోపోయిన చనిపోయినా వారికి ఇన్సూరెన్స్ సొమ్ము అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మరోవైపు ప్రకృతి విపత్తుల నుంచి అరికట్టేందుకు రూ.3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధులను సమకూర్చనున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర ముందే కల్పిస్తామని హామీ ఇచ్చారు. దళారీ వ్యవస్థను అరికడతామని హామీ ఇచ్చారు. 

ప్రతీ మండలంలో కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ లు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే రైతన్న వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందేలా పాడిలను కూడా అందజేస్తామన్నారు. పాడి ఉన్నఇంట సిరులు పంట కురిపిస్తానని హామీ ఇచ్చారు. 

సహకర రంగంలో పాలడైరీ వ్యవస్థను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. సహకర రంగం డైరీలను ప్రోత్సహించి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతు ఇంట వచ్చే పాలును సహకార  
రంగం డైయిరీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

సహకార రంగంలో డైయిరీకి పాలు పోస్తే లీటర్ కు రూ.4 చొప్పున బోనస్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. నాలుగు రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల ప్రైవేట్ డెయిరీలు సైతం రైతులు నిర్ణయించిన ధరకే పాలు కొనుగోలు చేసేలా ఉంటుందన్నారు. 

అలాగే ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.4000కోట్లు ప్రకృతి విపత్తులు ఫండ్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగువేల కోట్ల రూపాయలలో కేంద్రం రూ.2వేల కోట్లు ఇవ్వగా రాష్ట్రప్రభుత్వం రూ.2వేల కోట్లు ఇస్తుందన్నారు. 

అలాగే ప్రకృతి విపత్తుల వల్ల కొబ్బరి చెట్లు కుప్పకూలిపోతే చెట్టుకు మూడు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని, జీడితోటలకు నష్టపరిహారం రూ. 30 వేలు కాస్తా 50వేలు చేస్తానని స్పష్టం చేశారు. 

అలాగే ప్రమాదవ శాత్తు రైతు చనిపోతే వైఎస్ఆర్ భీమా కింద రూ.5లక్షలు చెల్లిస్తానని చెప్పారు. ఇదే అంశంపై మెుట్టమెదట చట్ట సభలో శాసనం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలోని 13 జిల్లాలను 25కి పెంచుతా: ముగింపు సభలో వైఎస్ జగన్

బాబు పాలనలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి : జగన్

పాదయాత్ర ముగింపు సభలో జగన్: నిరుద్యోగులను మోసం చేసిన బాబు

జాతీయ రాజకీయాల పేరుతో చంద్రబాబు డ్రామాలు

ముగిసిన పాదయాత్ర: చంద్రబాబుపై మండిపడ్డ జగన్

ముగిసిన ప్రజాసంకల్పయాత్ర: పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

 

Follow Us:
Download App:
  • android
  • ios