కర్నూల్:  తొలి రాత్రే  ఓ నవ వధువుకు చుక్కలు చూపించాడు భర్త. తాను సంసారానికి పనికిరాడనే విషయం తొలిరాత్రే నవవధువుకు తెలిసింది.దీంతో నవ వధువు నగ్న చిత్రాలను  తీశాడు. తాను సంసారానికి పనికిరాడనే విషయాన్ని  బయట పెడితే  తన నగ్న చిత్రాలను బయటపెడతానని  నవ వధువు ఆరోపిస్తోంది.

అనంతపురం జిల్లా రాయదుర్గం కు చెందిన ఓ యువతికి  అదే పట్టణానికి చెందిన రాజేంద్రప్రసాద్ కు  గత ఏడాది ఆగష్టు  రెండో తేదిన వివాహమైంది.
రాజేంద్రప్రసాద్  సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అయితే పెళ్లి సమయంలో  వధువు కుటుంబసభ్యులు  రూ. 45 లక్షల కట్నం ఇచ్చారు.

అయితే  రాజేంద్రప్రసాద్ సంసారానికి పనికిరాడనే విషయాన్ని బయటకు చెబితే  తన నగ్న చిత్రాలను బయట పెడతానని  తన భర్త తనను బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్త, మామలకు కూడ చెబితే తననే బెదిరించారని చెప్పారు.

అయితే తనకే టీబీ ఉందని  తప్పుడు ప్రచారం చేశారని రాజేంద్రప్రసాద్ కుటుంబసభ్యులపై యువతి ఆరోపించారు.  తనకు టీబీ లేదని  రాజేంద్రప్రసాద్  కుటుంబసభ్యులు చూపిన ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొంటే  ఎలాంటి జబ్బు లేదని తేలిందని ఆ యువతి చెప్పారు.

తన భర్త సంసారానికి పనికిరాడనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారని  బాధితురాలు చెప్పారు.  అంతేకాదు  తనకు లేనిపోని రోగాలు అంటగట్టారని  ఆమె  చెప్పారు. ఈ విషయమై పోలీసులకు కూడ ఫిర్యాదు చేసినట్టు  బాధితురాలు తెలిపారు.

తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నవ వధువు ఆరోపిస్తోంది. అంతేకాదు తనను  ఇబ్బందులకు గురిచేస్తున్నారని  ఆమె ఆరోపించారు.  మరో వైపు మరో పెళ్లి చేసుకొనేందుకు వీలుగా తనకు విడాకులు కావాలని రాజేంద్రప్రసాద్  బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడని  బాధితురాలు ఆరోపిస్తోంది.

తన మాదిరిగా మరో యువతి జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశ్యంతోనే తాను మీడియాను ఆశ్రయించినట్టు  బాధితురాలు చెప్పారు.  పెద్ద మనుషుల మధ్య కూడ పంచాయితీ నిర్వహించినా కూడ  ఫలితం లేకపోయిందని బాధితురాలు చెప్పారు.

ఈ వార్తలు చదవండి

ఆ అవసరం లేదు: భార్య ఆరోపణలపై టెక్కీ

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్