కర్నూల్: తన మీద తన భార్య చేస్తున్న తప్పుడు ఆరోపణలు చేస్తోందని టెక్కీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. తనతో పెళ్లి తన భార్యకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. అంతేకాదు తన భార్యకు  టీబీ జబ్బు ఉందని  ఆయన స్పష్టం చేశారు.  ఈ మేరకు తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తాను నపుంసకుడిని కానని నిరూపించుకోవాల్సిన  అవసరం లేదన్నారు. 

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన టెక్కీ రాజేంద్రప్రసాద్‌పై భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త సంసారానికి కూడ పనికిరాడని  బాధితురాలు ఆరోపించింది.ఈ విషయమై మీడియాను కూడ బాధితురాలు పేర్కొంది.  మీడియాలో  వచ్చిన వార్తలపై  రాజేంద్రప్రసాద్  ఓ మీడియా ఛానెల్‌లో తన వివరణ ఇచ్చాడు.

తాను సంసారానికి పనికిరాడనే  విషయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.  తాను  ఫిట్‌గా ఉన్నానని నిరూపించుకోవాల్సిన తనకు లేదన్నారు.  అంతేకాదు బాధితురాలిని తొలి రాత్రే నగ్నంగా  వీడియోలు తీసినట్టుగా  ఆరోపణలను ఆయన ఖండించారు.

తన భార్యకు  టీబీ ఉందన్నారు.  టీబీ వ్యాధి ఉందని  ఈ విషయమై తన వద్ద డాక్టర్ సర్టిపికెట్ ఉందన్నారు.  తాను తన అత్తింటి నుండి సుమారు రూ65 లక్షలు కట్నంగా తీసుకొన్నట్టు చేస్తున్న ఆరోపణలు లేవన్నారు.

తాను కట్నం తీసుకోవడానికి తాను వ్యతిరేకమన్నారు. తన భార్యకు  టీబీ జబ్బు ఉన్న కారణంగా తన భార్య తనకు దూరంగా ఉందన్నారు.  ఈ పెళ్లి తన భార్యకు ఇష్టం లేదన్నారు. అందుకే తనతో సంసారానికి ఆమె ఇష్టంగా లేదన్నారు. 

కక్షకట్టి  తనపై  తన భార్య, ఆమె కుటుంబసభ్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు తమ కుటుంబ పరువు  తీసేందుకు  తన భార్య కుటుంబీకులు ఇలా చేస్తున్నారన్నారు.

తాను తన భార్యను తొలి రాత్రి పూట నగ్న చిత్రాలు తీయలేదన్నారు. బాధితురాలిపై కోర్టులో కేసు వేసినట్టు చెప్పారు.ఈ కేసు విషయం తెలిసిన తర్వాత  బాధితులు మీడియాను ఆశ్రయించారని చెప్పారు.

తాను ఎక్కడికి  పారిపోలేదన్నారు.  తాను ఇంటి నుండి ఆఫీసుకు వెళ్తున్నట్టు చెప్పారు. మరో వైపు బాధితురాలి ఫిర్యాదు మేరకు  చర్యలు తీసుకొంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 
 

నపుంసకుడు, నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్: టెక్కీపై భార్య ఆరోపణలు

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్