సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏ భర్తా చేయకూడని పనిచేశాడో వ్యక్తి. భార్యతో ఏకాంతంగా కలిసి వున్న వీడియోలను యూట్యూబ్‌లో పెట్టేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరం ఏటీ అగ్రహారానికి చెందిన ఓ మహిళ తన భర్త వికృత చర్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులే ఆ భర్త ఆటకట్టించే పనిలో పడ్డారు. దిశా పోలీసుస్టేషన్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన పోలీసులు ఆ దుర్మార్గుడిని కటకటాల్లోకి నెట్టారు. ఇప్పటీకే ఐటీ కోర్‌ బృందం సదరు భర్త అప్‌లోడ్ చేసిన వీడియోలను తీసివేసే పనిలో నిమగ్నమైంది.

పోలీసులు యుద్ధప్రాతిపదికన కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పుడు అప్‌లోడ్‌ చేశాడు.. ఎన్ని వీడియోలు ఉన్నాయి.. యూట్యూబ్‌లో కాకుండా, ఇతరత్రా సామాజిక మాధ్యమాల్లో ఏదైనా అప్‌లోడ్‌ చేశాడా...? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.