తిరుపతి:  మద్యం సేవించిన మత్తులో ఓ యువకుడు మిత్రులను ఆటపట్టించబోయిఅసువులు బాశాడు. అతను స్నేహితులను ఆటపటించాలనుకున్నాడు. తాను చనిపోతున్నానంటూ ఫ్రెండ్స్‌కు వీడియో కాల్‌ చేశాడు. 

వారి ముందు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు డ్రామా ఆడాలని అనుకున్నాడు. అందులో భాగంగా చీరను తీసుకుని ఫ్యానుకు కట్టి మెడకు ఉరి బిగించుకున్నాడు. ఇంతలోనే మెడకు ఉరి బిగిసింది.  ఉరి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే , ఫలితం లేకపోయింది. సరదా కోసం చేద్దామనుకున్న పని ప్రమాదంగా పరిణమించి మృత్యువు ఒడిలోకి చేరాడు. 

స్నేహితులు చూస్తుండగానే అతను  ప్రాణాలు విడిచాడు. సూసైడ్ వీడియోను రికార్డు చేస్తూ ప్రాణాలు విడిచాడు. 108 కి 100 కి కాల్ చేసినా ప్రయోజనం లేకపోయింది,