అమరావతి: ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి సర్వేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. లగడపాటి రాజగోపాల్ ఆంధ్రా ఆక్టోపస్ కాని ఇది ఎల్లో జలగ అంటూ ట్వీట్ చేశారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్కెచ్ లో భాగమే లగడపాటి సర్వే అంటూ ఆరోపించారు. ఈనెల 23న కౌంటింగ్ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే గెలుస్తామని లగడపాటి చెప్పాడు అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగ్ కారణం అని చెప్పేందుకే ఈ గోల అంటూ ట్వీట్ చేశారు. 

ఇకపోతే శనివారం సాయంత్రం లగడపాటి రాజగోపాల్ ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అధిక బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాబట్టి అక్కడి ప్రజలు కారును ఎంచుకున్నారని అయితే ఏపీ లోటు బడ్జెట్ రాష్ట్రం గనుక ఏపీ ప్రజలు సైకిల్ ఎక్కారన్నారు. 

పరోక్షంగా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇకపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతాడంటూ చెప్పుకొచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కంటే తక్కువ సీట్లు వస్తాయని తేల్చి చెప్పేశారు లగడపాటి రాజగోపాల్. 

 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో సైకిల్, తెలంగాణలో కారు : తేల్చేసిన లగడపాటి రాజగోపాల్

ఎన్నికల మధ్యలో జగన్ ను కలిశా: లగడపాటి రాజగోపాల్

పవర్ స్టార్ అసెంబ్లీలో అడుగు పెడ్తాడు, మెగాస్టార్ కన్నా తక్కువ సీట్లే: లగడపాటి

హంగ్ ఏర్పడే పరిస్థితి లేదు, పూర్తి మెజారిటీతోనే ప్రభుత్వం : లగడపాటి