అమరావతి: రాజకీయాల్లో తనకు వైఎస్ జగన్ కుటుంబంతో అనుబంధం ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. ఎన్నికల మధ్యలో తాను వైఎస్ జగన్ ను కలిసినట్లు స్పష్టం చేశారు. 

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత తాను పులివెందుల వెళ్లినట్లు స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపానన్నారు. ఆ సందర్భంలో వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ, భారతి, షర్మిలలను కూడా కలిసినట్లు చెప్పుకొచ్చారు. 

తమకు వైఎస్ రాజారెడ్డి కాలం నాటి నుంచి వారితో కలిసి మంచి సంబంధాలున్నాయన్నారు. వైఎస్ కుటుంబంతో కలిసి వ్యాపారం చేసినట్లు తెలిపారు. తనకు తెలుగుదేశం పార్టీ కన్నా, పవన్ కళ్యాణ్ కుటుంబం కంటే వైఎస్ఆర్ కుటుంబంతోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారంతా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే కాబట్టి వారితో మంచి అనుబంధం ఉందన్నారు. వారిలో కొంతమంది ఎన్నికల ఫలితాలపై ఆరా తీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 

అయితే ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. వైసీపీ అధికారంలోకి వస్తుందా లేదా అన్నది మాత్రం స్పష్టం చెయ్యలేదు సరికదా వైసీపీ భవిష్యత్ పై కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

ఈ వార్తలు కూడా చదవండి

పవర్ స్టార్ అసెంబ్లీలో అడుగు పెడ్తాడు, మెగాస్టార్ కన్నా తక్కువ సీట్లే: లగడపాటి

ఏపీలో సైకిల్, తెలంగాణలో కారు : తేల్చేసిన లగడపాటి రాజగోపాల్

హంగ్ ఏర్పడే పరిస్థితి లేదు, పూర్తి మెజారిటీతోనే ప్రభుత్వం : లగడపాటి