అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారని ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. అయితే జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తోందన్న అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

పవన్ కళ్యాణ్ కచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాడని జోస్యం చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని రాజకీయాల్లోకి కూడా పవర్ స్టార్ అవుతారన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడు అని రెండో తమ్ముడు అంటూ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

అయితే జనసేన పార్టీ రెండంకెల స్థానాల్లో విజయం సాధిస్తుందా లేక రెండు సీట్లతో జనసేన పార్టీ గెలుస్తోందా అన్నది మాత్రం చిక్కుముడి వీడాల్సి ఉంది. ఇకపోతే మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ కాబట్టి అంటే చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ చిన్నవాడు కాబట్టి ప్రజారాజ్యం పార్టీ కంటే జనసేనకు తక్కువ సీట్లు వస్తాయా అన్న దానిపై సమాధానం దాటవేశారు లగడపాటి రాజగోపాల్. జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక్కరే గెలుస్తారా లేక రెండంకెల స్థానాల్లో విజయం సాధిస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో సైకిల్, తెలంగాణలో కారు : తేల్చేసిన లగడపాటి రాజగోపాల్

హంగ్ ఏర్పడే పరిస్థితి లేదు, పూర్తి మెజారిటీతోనే ప్రభుత్వం : లగడపాటి

ఎన్నికల మధ్యలో జగన్ ను కలిశా: లగడపాటి రాజగోపాల్