అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే పరిస్థితి లేదని ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. హంగ్‌ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదని కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. 

శనివారం సాయంత్రం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటి వరకు ఏనాడు తెలుగు ప్రజలు ఎప్పుడూ స్పష్టమైన తీర్పే ఇచ్చారని, గజిబిజిగా తీర్పు ఇవ్వలేదన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. 

తెలంగాణ ప్రజలు కారును కోరుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకిల్ పై ప్రయాణించారంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడు పవన్‌ కల్యాణ్‌ కచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతారని అన్నారు. ఈ ఎన్నికల్లో 95శాతం ప్రజలు మూడు పార్టీలకు ఓట్లు వేశారని తెలిపారు. అయితే ఒకే పార్టీకి మెజారిటీ వచ్చేలా ప్రజలు తీర్పునిచ్చారని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఎన్నికల మధ్యలో జగన్ ను కలిశా: లగడపాటి రాజగోపాల్

పవర్ స్టార్ అసెంబ్లీలో అడుగు పెడ్తాడు, మెగాస్టార్ కన్నా తక్కువ సీట్లే: లగడపాటి

ఏపీలో సైకిల్, తెలంగాణలో కారు : తేల్చేసిన లగడపాటి రాజగోపాల్