హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడటం దురదృష్ఖరమని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాధాకృష్ణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికీ ఇవ్వలేనంత భరోసా ఇచ్చిందన్నారు. 

2014 ఎన్నికల్లో వంగవీటి రాధా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారని ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు. ఒకవేళ ఎన్నికల్లో రాధా ఓడిపోతే బాధ్యత పార్టీ తీసుకుంటుందని ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్లు శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

మరి ఆయన ఎందుకు పార్టీమారారో అర్థం కావడం లేదన్నారు. ఆయన పార్టీలో ఉంటే బాగుంటుందని ఒకసారి పునరాలోచించుకోవాలని కోరారు. రాధా మాతో ఉండాలని ఇప్పటికీ తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాధా పార్టీ వీడటం మాత్రం బాధాకరమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

 అయతే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయని అది కరెక్ట్ కాదన్నారు. వంగవీటి మోహన్ రంగాను చంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అలాంటి పార్టీలోకి వెళ్తే ప్రజలు అంగీకరించరన్నారు. ఒకసారి రాధా తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు.  

ఈ వార్తలు కూడా చదవండి

వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీపీ

వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాం