ఈ ప్రశ్నపత్రమే టీచరమ్మ పెళ్లి ఆహ్వానపత్రిక ... 100/100 ఏళ్ల జీవితమే మార్కులు...
ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులు వినూత్నంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ టీచరమ్మ చాలా కొత్తగా, తన ప్రొఫెషన్ ను తెలియజేసేలా ఆహ్వాన పత్రికను తయారుచేయించుకుంది. ఈ వెడ్డింగ్ కార్డ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Verity Wedding Card : నేటి యువతరం ప్రతిదీ ప్రత్యేకంగా వుండాలని కోరుకుంటున్నారు. నలుగురిలో నారాయణ అనిపించుకోడానికి ఇష్టపడటంలేదు... తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నారు. ప్రతిరోజూ వేసుకునే డ్రెస్సింగ్ నుండి జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లివరకు ప్రతి విషయంలో ప్రత్యేకంగా వుండాలని కోరుకునే యువతీయువకులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు... పెళ్లి కార్డుల నుండి హనీమూన్ వరకు స్పెషల్ గా వుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
తాజాగా ఓ యువకుడి తన పెళ్లి కార్డును సరికొత్తగా డిజైన్ చేసుకున్నాడు. అచ్చ తెలంగాణ యాసలో, అచ్చ తెలుగులో, చివరకు గ్రాంధిక బాషలో కొందరు... మా మామ పెళ్లికి రండి, బాబాయ్ పెళ్లికి, పిన్ని పెళ్లికి రండి, మేనత్త పెళ్లికి రండి అంటూ మరికొందరు పెళ్లికి ఆహ్వానించే కార్డులను చూసాం... కానీ మీరు క్వశ్చర్ పేపర్ ఆహ్వాన పత్రికను చూసారా..? అతిథులకు ప్రశ్నలు సందిస్తూ... అందులోనే జవాభిస్తూ సరికొత్తగా అతిథులను ఆహ్వానించిందో పశ్చిమ గోదావరి అమ్మాయి.
పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన అనూష ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇటీవలే ఫణీంద్ర అనే అబ్బాయితో పెళ్ళి నిశ్చయం అయ్యింది... ఈ నెల 23న మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటి కానున్నారు. ఈ క్రమంలోనే అతిథులను ఆహ్వానించేందుకు ఈ టీచరమ్మ సరికొత్త వెడ్డింగ్ కార్డును తయారుచేయించుకుంది.
పెళ్లి ఆహ్వాన ప్రశ్నపత్రం :
ప్రత్యూష పెళ్ళి కార్డును గమనిస్తే ప్రశ్నలు, జవాబులతో నిండివుంది. సింగిల్ ఆన్సర్, మల్టీపుల్ ఛాయిస్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్లను అతిథులపై సందిస్తూ... సరైన సమాధానాన్ని చెప్పెసారు. ఇలా టీచరమ్మ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులో ప్రశ్నలు, జవాబులు ఇలా వున్నాయి.
1. పెళ్లికొడుకు ఫోటోను పెట్టి ఈయన ఎవరో గుర్తుపట్టారా? అంటూ ప్రశ్నించారు.
జవాబు : పెళ్లికొడుకు ఫణీంద్ర
2. పెళ్లికూతురు పేరును (ఇంగ్లీష్ లో) సరిచేయండి..?
PRATUSHA
జవాబు : PRATHYUSHA
3. పెళ్లికొడుకు తల్లిదండ్రులు------
జవాబు : డా. చిందెళ్ల శ్రీరామ మూర్తి - జానకిదేవి
4. కన్యాదాతలు ఎవరు?
జవాబు : నర్కెడమిల్లి సతీష్ - రాణి
5. ఈ తేదీల్లో పెళ్లిరోజు ఎప్పుడో గుర్తించండి..? జవాబు (C)
a. 25-8-24 b. 18-11-24 c. 23-8-24 d. 09-07-24
6. పెళ్లి సమయం ఎప్పుడు? జవాబు (b)
a. 12:30 pm b. 2:45 am c. 8:58 am d. 7.00 pm
7. పెళ్ళి ఎక్కడ జరుగుతుంది?
జవాబు : శ్రీ వేణుగోపాల ఆడిటోరియం, మాటేరు, పశ్చిమ గోదావరి
8. ఇందులో true లేదా false గుర్తించండి
1. విందు 7:00 pm కు స్టార్ట్ అవుతుంది (T)
2. అందరూ ఆహ్వానితులే (T)
3. బహుమతులు అంగీకరించబడవు (T)
ఇలా పెళ్ళికార్డును ప్రశ్నలు, జవాబులతో నింపేసి 100/100 ఏళ్లు జీవిస్తామని టీచరమ్మ తెలిపింది.