హైదరాబాద్: 2004 లో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో.... ఇవాళ వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొన్నారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కేవలం 40కు పైగా అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది.  

ఆ ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్‌ పొత్తు పెట్టుకొన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. 2004 మే 14వ తేదీన ఎల్బీ స్టేడియం వేదికగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమ వేదికపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఆ పార్టీ ఎంపీ ఆలే నరేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ఆర్‌ను కేసీఆర్ ఆలింగనం చేసి అభినందించారు.  టీఆర్ఎస్ ఎంపీ నరేంద్ర కూడ వైఎస్ఆర్‌ను అభినందించారు.

2014లో ఉమ్మడి రాష్ట్రం విభజించారు. ఏపీ, తెలంగాణగా విడిపోయింది. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయం సాధించింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది.

గురువారం నాడు వైఎస్ జగన్ ఇందిరా గాంధీ మున్సిఫల్ స్టేడియంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు.  సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌ను కేసీఆర్ అభినందించారు. మూడు లేదా నాలుగు దఫాలు ఏపీ రాష్ట్రానికి జగన్ సీఎం కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

72 గంటల్లో ప్రతి సమస్యకూ పరిష్కారం: గ్రామ సచివాలయంపై జగన్

సీఎం ఆఫీసులో కాల్ సెంటర్‌, ఏడాదిలోపు అవినీతి అంతం: జగన్

ఖడ్గ చాలనం వద్దు కరచాలనమే: కేసీఆర్

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం

వృద్దులకు కొత్త సీఎం జగన్ వరం: తొలి సంతకం ఇదే