అమరావతి : ఆరు నుండి ఏడాది పాటు సమయాన్ని ఇస్తే రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అవినీతి రహిత పాలనను అందిస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో జ్యూడీషీయల్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు జగన్ ప్రకటించారు.

గురువారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ప్రసంగించారు .అవినీతి లేని, స్వచ్ఛమైన పాలనను అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పైస్థాయి నుండి కింది స్థాయి వరకు ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు.అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో... పనులను రద్దు చేస్తామని  జగన్ ప్రకటించారు. అవినీతి లేని పాలనను అందిస్తామన్నారు.

ఎక్కువ మంది టెండర్ ప్రక్రియలో పాల్గొనేలా చేసేందుకు వీలుగా రివర్స్ టెండర్‌ ప్రక్రియను అమలు చేస్తామన్నారు. గత  ప్రభుత్వం ఏ రకంగా టెండర్లలో అవినీతికి పాల్పడిందో ప్రజలకు వివరిస్తామన్నారు. గత పాలకుల పాలనలో ఏ మేరకు అవినీతి వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అయిందో ప్రజల ముందు పెడతామన్నారు. 

రాష్ట్రంలో అవినీతికి దూరంగా తమ పాలన ఉంటుందని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు.రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటామన్నారు. సౌర, పవన్ విద్యుత్ కొనుగోలు రేట్లను తగ్గిస్తామన్నారు.

త్వరలోనే ఏపీ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసి జ్యూడిషీయల్ కమిషన్ వేయాలని అడుగుతానని ఆయన చెప్పారు.... హైకోర్టు జడ్జిని జ్యూడీషీయల్ కమిషన్‌ కు ఛైర్మెన్‌గా నియమిస్తామన్నారు. జ్యూడీషీయల్ కమిషన్ సూచనల మేరకే కాంట్రాక్టర్లను టెండర్లకు పిలుస్తామని జగన్ హామీ ఇచ్చారు. 

అవినీతిపై ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. ఈ కాల్ సెంటర్‌ నెంబర్‌ ను కూడ ప్రజలకు ఇవ్వనున్నట్టు చెప్పారు.ఆగష్టు 15వ తేదీన సీఎం కార్యాలయంలో ఈ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు తమ  ఫిర్యాదులను నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకొంటామని జగన్ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో చంద్రబాబునాయుడు మినహా ఎవరూ కూడ సీఎంగా ఉండకూడదని ఎల్లో మీడియా కోరుకొందని జగన్ విమర్శించారు. పారదర్శకంగా కాంట్రాక్టు పనులు నిర్వహించే ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాస్తే ఆ ఎల్లో మీడియాపై చర్యలు తీసుకోవాలని కోర్టులను కోరుతామన్నారు.

సంబంధిత వార్తలు

ఖడ్గ చాలనం వద్దు కరచాలనమే: కేసీఆర్

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం

వృద్దులకు కొత్త సీఎం జగన్ వరం: తొలి సంతకం ఇదే