అమరావతి:   రెండు రాష్ట్రాలు ఖడ్గ చాలనం చేయొద్దు.. కరచాలనం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. గోదావరి జలాలను   రెండు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కృష్ణా నది జలాల వినియోగంలో కొన్ని సమస్యలు ఉన్నాయని  ఆయన చెప్పారు. కానీ, గోదావరి నదీ జలాలను రెండు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఒక్క టర్మ్ కాదు... నాలుగైదు టర్మ్‌లు రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సీఎంగా జగన్ ప్రమాణం చేసిన తర్వాత అతిథులు ప్రసంగించారు.ఏపీ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌కు తెలంగాణ సీఎం శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ప్రజల తరపున అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ వయస్సు చిన్నది.. బాధ్యత పెద్దది అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బాధ్యతను నెరవేర్చే శక్తి ఉందని నిరూపించుకొన్నారని కేసీఆర్ చెప్పారు. తండ్రి నుండి శక్తి సామర్థ్యాలు సంక్రమించాయలని  కేసీఆర్

గురువారం నాడు ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన  తర్వాత వైఎస్ జగన్ ప్రసంగించారు. గవర్నర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వేదికపై సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు.

డీఎంకె చీఫ్ స్టాలిన్ తెలుగులో అందరీకీ నమస్కారం అంటూ ప్రసంగించారు. ఏపీ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

సీఎం ఆఫీసులో కాల్ సెంటర్‌, ఏడాదిలోపు అవినీతి అంతం: జగన్

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం

వృద్దులకు కొత్త సీఎం జగన్ వరం: తొలి సంతకం ఇదే