ఏ సమస్యనైనా గ్రామ సచివాలయం ద్వారా 72 గంటల్లో పరిష్కరించనున్నట్టు ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రభుత్వ పథకాలన్నీ కూడ నేరుగా లబ్దిదారుల ఇంటికే చేరుతాయని ఆయన హామీ ఇచ్చారు.
అమరావతి: ఏ సమస్యనైనా గ్రామ సచివాలయం ద్వారా 72 గంటల్లో పరిష్కరించనున్నట్టు ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రభుత్వ పథకాలన్నీ కూడ నేరుగా లబ్దిదారుల ఇంటికే చేరుతాయని ఆయన హామీ ఇచ్చారు.
గురువారం నాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ ప్రసంగించారు.పరిపాలనలో సంస్కరణలకు వీలుగా గ్రామాల్లో సచివాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో పది మందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను కల్పిస్తామన్నారు.
అక్టోబర్ రెండో తేదీ నాటికి లక్షన్నర ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆయన హామీ ఇచ్చారు.నవరత్నాల్లోని ఏ హామీనైనా అమలు కావడానికి గ్రామ సచివాలయాల్లో ధరఖాస్తు చేసుకొంటే 72 గంటల్లోనే సమస్య పరిష్కరిస్తామని జగన్ ప్రకటించారు.
ఆగష్టు 15వ తేదీనాటికి కేవలం రెండున్నర నెలల్లో గ్రామాల్లో గ్రామ వాలంటీర్లుగా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలను కల్పించనున్నట్టు జగన్ ప్రకటించారు.ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందేలా గ్రామ వలంటీర్లు పనిచేస్తారని జగన్ చెప్పారు.
ప్రతి 50 ఇళ్లకు ఒక్క గ్రామ వలంటీర్‌ను నియమించనున్నట్టు జగన్ హమీ ఇచ్చారు. సేవ చేసే ఉద్దేశ్యం ఉన్న యువతకు ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. వలంటీర్‌గా నియమితులైన వారికి ప్రతి నెల రూ.5 వేల వేతనాన్ని ఇస్తామని జగన్ ప్రకటించారు.
ఆగష్టు 15వ తేదీ నాటికి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అందించడంలో పార్టీలు, ప్రాంతాలు అనే వివక్ష ఉండదని ఆయన తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు
సీఎం ఆఫీసులో కాల్ సెంటర్, ఏడాదిలోపు అవినీతి అంతం: జగన్
